సామాన్యుల నడ్డి విరుస్తున్న ధరలు

ప్రధానాంశాలు

సామాన్యుల నడ్డి విరుస్తున్న ధరలు

ఐద్వా జాతీయ కార్యదర్శి మరియం దవలే

కుడకుడరోడ్డు, న్యూస్‌టుడే: భాజపా అధికారం చేపట్టిన నాటి నుంచి దేశంలో మత విద్వేషాలను పెంచి పోషిస్తోందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం దవలే ఆరోపించారు. ఐద్వా మూడో మహాసభ సందర్భంగా శుక్రవారం సూర్యాపేటలో జరిగిన బహిరంగ సభలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడారు. కేంద్రం దేశ సంపదను కార్పొరేట్‌లకు ధారాదత్తం చేస్తోందని విమర్శించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రాంగారెడ్డి, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడారు. ఈ నెల 27న జరిగే భారత్‌బంద్‌ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఇంధనం, గ్యాస్‌ ధరలు పెంచడంతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని