ఇక సంచార టీకా... చకచకా!

ప్రధానాంశాలు

ఇక సంచార టీకా... చకచకా!

వ్యాక్సిన్‌ ఆన్‌ వీల్స్‌తో కలిసి సర్కారు సన్నాహాలు

ఈనాడు, సంగారెడ్డి: కొవిడ్‌ టీకా అందని మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికీ ఉపయోగపడేలా సంచార టీకా ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం తమ ‘వ్యాక్సిన్‌ ఆన్‌ వీల్స్‌’ సేవలను వాడుకునేందుకు నిర్ణయించిందని ఐఐటీ హైదరాబాద్‌ వర్గాలు తెలిపాయి. రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 50కి పైగా సంచార టీకా క్లినిక్‌లను అందుబాటులోకి తేనున్నారు. దేశంలో అన్ని రకాల టీకాలను అర్హులందరికీ అందించేందుకు ఐఐటీ హైదరాబాద్‌ వేదికగా జిగ్నేష్‌ పటేల్‌ 2019లో ‘వ్యాక్సిన్‌ ఆన్‌ వీల్స్‌’ వాహనానికి రూపమిచ్చారు. ఇందులో నిపుణులైన వైద్యసిబ్బంది ఉంటారు. టీకాలను భద్రపర్చడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ బృందం ఇప్పటికే పుణె రోటరీ క్లబ్‌, ఇతర సంస్థల సహకారంతో మహారాష్ట్రలో కొవిడ్‌ టీకాలు వేయడంలో నిమగ్నమైంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు 2 లక్షల డోసులు వేశారు. వీరి సేవలను వినియోగించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. కార్పొరేట్‌, స్వచ్ఛంద సంస్థల సహకారంతో అందరూ టీకాలు తీసుకునే విధంగా పనిచేస్తున్నామని జిగ్నేష్‌ పటేల్‌ తెలిపారు. వచ్చే ఆరు నెలల్లో 10 లక్షల డోసులు ఇవ్వడమే తమ లక్ష్యమన్నారు. మైక్రో వ్యాక్సినేషన్‌ బూత్‌లనూ ఏర్పాటు చేస్తామని వివరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని