రెవెన్యూ సమస్యలపై స్పందించకపోతే కార్యాచరణ

ప్రధానాంశాలు

రెవెన్యూ సమస్యలపై స్పందించకపోతే కార్యాచరణ

ట్రెసా రాష్ట్ర సమావేశంలో నిర్ణయం 

ఈనాడు, హైదరాబాద్‌: రెవెన్యూ శాఖలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలను పరిష్కరించాలని ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్‌కుమార్‌ డిమాండు చేశారు. ఉద్యోగులకు పనిభారం తగ్గించేందుకు కొత్తజోనల్‌ విధానం మేరకు వెంటనే జిల్లాలవారీగా సంఖ్యను ఖరారు చేయాలని, అన్ని తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఖాళీలు భర్తీ చేయాలని కోరారు. కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం అన్ని కేడర్‌ ఉద్యోగులకు జాబ్‌ చార్ట్‌ ప్రకటించాలని, అర్హులకు పదోన్నతులు కల్పించాలని కోరారు. తమ సమస్యలను తీర్మానాల రూపంలో ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని, ఇప్పటికైనా స్పందించి సమస్యలు వెంటనే పరిష్కరిస్తుందని ఆశిస్తున్నామని, లేని పక్షంలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఆదివారం శామీర్‌పేటలో జరిగిన ట్రెసా రాష్ట్రస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. సంఘం నేతలు ప్రభాకర్‌, పూల్‌సింగ్‌, రాజ్‌కుమార్‌, రియాజుద్దీన్‌, రామకృష్ణ, యాదగిరి తదితర నేతలు, 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, డివిజన్ల, కలెక్టరేట్‌ యూనిట్‌ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ, స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లకు సెలక్షన్‌ గ్రేడ్‌ ఏర్పాటు చేయాలని కోరారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని