భువనగిరి కోట.. నిర్లక్ష్యం మేట..!

ప్రధానాంశాలు

భువనగిరి కోట.. నిర్లక్ష్యం మేట..!

హైదరాబాద్‌కు కేవలం 47 కి.మీ. దూరాన ఉన్న భువనగిరి కోటలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది.. ఏకశిలాపర్వతంపై రూపుదిద్దుకున్న ఈ కోటకు ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉంది. అయినా కనీస వసతులు కానరావు.. కోట విశేషాల గురించి వివరించే వారు లేకపోవటంతో సందర్శకులు నిరాశ చెందుతున్నారు. కోట పైకి ‘రోప్‌ వే’ నిర్మాణ ప్రతిపాదనలున్నా కార్యరూపం దాల్చలేదు.. పిచ్చిమొక్కలు మొలిచిన మార్గంలో ప్రయాసపడి కోటపైకి చేరినా దప్పిక తీర్చుకునేందుకు అక్కడ గుక్కెడు నీళ్లూ దొరకవు.. ఈ నేపథ్యంలో పర్యాటక ప్రాధాన్యమున్న భువనగిరి కోటను అన్నివిధాల అభివృద్ధి చేయాలని స్థానిక ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇటీవల కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి విజ్ఞప్తిచేశారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా అయినా అధికారులు ఈ కోటలో వసతుల కల్పనపై దృష్టిపెట్టాలనేది సందర్శకుల ఆకాంక్ష.

- ఈనాడు, హైదరాబాద్‌

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని