పులుల సంరక్షణకు.. ర్యాలీ ఆన్‌ వీల్స్‌

ప్రధానాంశాలు

పులుల సంరక్షణకు.. ర్యాలీ ఆన్‌ వీల్స్‌

రాష్ట్రంలో అమ్రాబాద్‌ నుంచి కవ్వాల్‌ వరకు నిర్వహణ

ఈనాడు, హైదరాబాద్‌: స్వాతంత్య్ర అమృత మహోత్సవాల్లో భాగంగా పులుల సంరక్షణ కోసం దేశవ్యాప్తంగా ర్యాలీలు ప్రారంభమయ్యాయి. దేశంలోని తొమ్మిది టైగర్‌ రిజర్వు అటవీ ప్రాంతాలను కలుపుతూ జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ (ఎన్టీసీఏ) 7,500 కి.మీ. మేరకు.. ‘ఇండియా ఫర్‌ టైగర్స్‌- ఏ ర్యాలీ ఆన్‌ వీల్స్‌’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని నాగార్జునసాగర్‌-శ్రీశైలం టైగర్‌ రిజర్వు అటవీ ప్రాంతంలో ఈ నెల 25న ప్రారంభమైన ర్యాలీ ఆదివారం రాష్ట్రంలోని అమ్రాబాద్‌ పులుల సంరక్షణ ప్రాంతంలోని మన్ననూరుకు చేరుకుంది. అక్కడ ఆదివారం జరిగిన కార్యక్రమంలో అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు ఫారెస్ట్‌ ఫీల్డ్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌, డీఎఫ్‌వో కిష్టాగౌడ్‌, ఎఫ్‌డీవోలు రోహిత్‌, నవీన్‌లు పాల్గొన్నారు. అమ్రాబాద్‌, శ్రీశైలం టైగర్‌ రిజర్వు అధికారులు హైదరాబాద్‌కు వస్తారు. అరణ్యభవన్‌ వద్ద రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి సోమవారం ఉదయం 10 గంటలకు జెండా ఊపి ర్యాలీ ప్రారంభిస్తారు. ర్యాలీ ఇక్కడి నుంచి కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు అటవీ ప్రాంతం వరకు కొనసాగుతుంది. ఒడిశాలోని సిమిలిపాల్‌ టైగర్‌ రిజర్వు వద్ద ముగుస్తుంది. పెద్దపులుల సంరక్షణకు దేశంలో 1973లో ‘ప్రాజెక్ట్‌ టైగర్‌’ ప్రారంభించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని