ఆయురారోగ్యాలు, సిరిసంపదలతో జీవించాలి

ప్రధానాంశాలు

ఆయురారోగ్యాలు, సిరిసంపదలతో జీవించాలి

రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌, సీఎం దసరా శుభాకాంక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్‌ దసరా పండగ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘తెలంగాణకు ఇది ప్రత్యేకమైన వేడుక. ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించకూడదనే స్ఫూర్తితో, చెడు మీద మంచి.. విజయానికి సంకేతంగా జరుపుకొనే పండగ’’ అని సీఎం తన సందేశంలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలు, సిరిసంపదలతో జీవించేలా దీవించాలని దుర్గామాతను ప్రార్థించినట్లు చెప్పారు. శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ప్రొటెం ఛైర్మన్‌ భూపాల్‌రెడ్డి, మంత్రులు కేటీ రామారావు, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, సత్యవతిరాథోడ్‌, సబితారెడ్డిలు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. మహర్నవమి సందర్భంగా గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై ఆయుధ పూజ నిర్వహించారు. 

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని