Traffic Jam: 4 కిలోమీటర్లు.. 40 నిమిషాలు.. విజయవాడ మార్గంలో భారీ ట్రాఫిక్‌జామ్‌

ప్రధానాంశాలు

Traffic Jam: 4 కిలోమీటర్లు.. 40 నిమిషాలు.. విజయవాడ మార్గంలో భారీ ట్రాఫిక్‌జామ్‌

చౌటుప్పల్‌గ్రామీణం, న్యూస్‌టుడే: హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై గురువారం రాత్రి భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దసరాకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు గురువారం ఉదయం నుంచే సొంతూరి బాట పట్టారు. సాయంత్రం సమయంలో వాహనాల రద్దీ మరింత పెరిగింది. చౌటుప్పల్‌ నుంచి కొయ్యలగూడెం వరకు ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 4 కిలోమీటర్ల ప్రయాణానికి 40 నిమిషాలకు పైనే సమయం పట్టింది. సాధారణంగా ఈ దూరాన్ని నాలుగు నిమిషాల్లో దాటేయచ్చు. చౌటుప్పల్‌లో అండర్‌పాస్‌ వంతెన లేకపోవడంతో పండగల వేళ, శుభకార్యాలు అధికంగా ఉన్నప్పుడు ట్రాఫిక్‌ సమస్య ఉత్పన్నమవుతోంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని