డుగ్గు డుగ్గు... నుగ్గు నుగ్గు...

ప్రధానాంశాలు

డుగ్గు డుగ్గు... నుగ్గు నుగ్గు...

శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న వెయ్యి ద్విచక్రవాహనాల సైలెన్సర్లను హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు తొలగించి వాటిని బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ ఉద్యానవనం వద్ద బుల్డోజర్‌తో మంగళవారం ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ మాట్లాడుతూ.. సినిమాల్లో చూసి కొందరు వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, ఇలాంటివి సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం మెకానిక్‌లు, ఆటోమొబైల్‌ దుకాణాల యజమానులకు అవగాహన కల్పించారు. దుకాణదారులు ఎవరైనా అనుమతి లేని సైలెన్సర్లు, హారన్లు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులకు జరిమానా విధించడంతో పాటు వాహనాలను స్వాధీనం చేసుకుంటామన్నారు. తొమ్మిది నెలల్లో దాదాపు 12,938 కేసులు నమోదు చేశామని ఆయన వివరించారు.

-న్యూస్‌టుడే, జూబ్లీహిల్స్‌

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని