కొత్తగా 202 కొవిడ్‌ కేసులు

ప్రధానాంశాలు

కొత్తగా 202 కొవిడ్‌ కేసులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 202 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకొని మొత్తం బాధితుల సంఖ్య 6,69,365కు పెరిగింది. మహమ్మారి కోరల్లో చిక్కి మరొకరు కన్నుమూయగా ఇప్పటి వరకూ 3,941 మంది మృతిచెందారు. కరోనా బారిన పడిన అనంతరం చికిత్స పొంది తాజాగా మరో 190 మంది ఆరోగ్యవంతులు కాగా మొత్తంగా 6,61,484 మంది కోలుకున్నారు. ఈ నెల 19న సాయంత్రం 5.30 గంటల వరకూ నమోదైన కొవిడ్‌ సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు మంగళవారం వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,940 మంది చికిత్స పొందుతున్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని