ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ నియామకంలోజాప్యంపై వివరణ ఇవ్వండి

ప్రధానాంశాలు

ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ నియామకంలోజాప్యంపై వివరణ ఇవ్వండి

ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ

ఈనాడు, హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ నియామకంలో జాప్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కమిషన్‌ను ఏర్పాటు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన చొప్పదండి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎం.సత్యం ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ గత కమిషన్‌ కాలపరిమితి ఫిబ్రవరిలో ముగిసిందన్నారు. వాదనలను విన్న ధర్మాసనం ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి తదితరులకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని