అటవీ సిబ్బందికి ఆయుధాలివ్వండి

ప్రధానాంశాలు

అటవీ సిబ్బందికి ఆయుధాలివ్వండి

ఈనాడు, హైదరాబాద్‌: స్మగ్లింగ్‌ను అరికట్టడానికి అటవీ సిబ్బందికి ఆయుధాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర అటవీ అధికారుల సంఘం విజ్ఞప్తిచేసింది. సమస్యాత్మక ప్రాంతాలతో పాటు అమ్రాబాద్‌, కవ్వాల్‌ టైగర్‌ రిజర్వుల్లో ‘ఫారెస్ట్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌’ ఏర్పాటు చేయాలని కోరింది. సిబ్బందిపై పనిభారం, ఒత్తిడి పెరగడంతో అధికారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆందోళన వ్యక్తంచేసింది. అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని మంగళవారం అరణ్య భవన్‌లో అటవీ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.రాజారమణారెడ్డితో పాటు సంఘం నేతలు ఎం.జోజి, కె.సుధాకర్‌రావు కలిసి వినతిపత్రం అందజేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని