‘హెరిటేజ్‌’ పరువు నష్టం కేసు 27కి వాయిదా

ప్రధానాంశాలు

‘హెరిటేజ్‌’ పరువు నష్టం కేసు 27కి వాయిదా

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: హెరిటేజ్‌ సంస్థ వేసిన పరువు నష్టం కేసులో ఏపీ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు బుధవారం నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులో హాజరయ్యారు. గతంలో పలుమార్లు వీరిద్దరూ విచారణకు హాజరు కాకపోవడంతో నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌(ఎన్‌బీడబ్ల్యూ) అమలు చేయాలని న్యాయస్థానం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఎన్‌బీడబ్ల్యూ ఉపసంహరించాలని మంత్రి, ఎమ్మెల్యే కోరగా వారెంట్‌ను రీకాల్‌ చేసిన కోర్టు విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. పిటిషనర్‌ తరఫున హెరిటేజ్‌ ప్రతినిధి సాంబమూర్తి హాజరయ్యారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని