‘ధరణి’ ఫిర్యాదుపై చర్యల నివేదిక పంపండి

ప్రధానాంశాలు

‘ధరణి’ ఫిర్యాదుపై చర్యల నివేదిక పంపండి

 జాతీయ మానవ హక్కుల కమిషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని ధరణి పోర్టల్‌లో నెలకొన్న సమస్యతో భూ యజమానులు ఇబ్బందులు పడుతున్నారనే ఫిర్యాదుపై నాలుగు వారాల్లో చర్యల నివేదికను అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) బుధవారం ఆదేశించింది. ధరణి పోర్టల్‌లో భూ సమస్యలు పరిష్కారం కావడంలేదని, దీంతో కొందరు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారంటూ కాంగ్రెస్‌ నాయకుడు జడ్సన్‌ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును రాష్ట్రానికి పంపుతూ చర్యల నివేదిక అందించాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశాలు జారీ చేసింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని