ఆర్‌ఐఎంసీలో బాలికల ప్రవేశానికి ప్రకటన జారీ

ప్రధానాంశాలు

ఆర్‌ఐఎంసీలో బాలికల ప్రవేశానికి ప్రకటన జారీ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజ్‌(ఆర్‌ఐఎంసీ)లో ఎనిమిదో తరగతిలో బాలికల ప్రవేశానికి ఆర్‌ఐఎంసీ తరఫున తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ)  జులై-2022కు  ప్రత్యేక ప్రకటన వెలువరించింది. దరఖాస్తులు, ప్రాస్పెక్టస్‌ను ఆర్‌ఐఎంసీ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్లో ఫీజు చెల్లించి ఆర్‌ఐఎంసీ దెహ్రాదూన్‌ నుంచి పొందాలని.. పూర్తి చేసిన దరఖాస్తుల్ని నవంబరు 15లోగా టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి పంపించాలని  టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ తెలిపారు. తెలంగాణ అభ్యర్థులకు హైదరాబాద్‌లో డిసెంబరు 18న ప్రవేశ పరీక్ష జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని