అనుమతిలేని ప్రదర్శన కేసులో నేతలకు ఊరట

ప్రధానాంశాలు

అనుమతిలేని ప్రదర్శన కేసులో నేతలకు ఊరట

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: అనుమతి లేకుండా ప్రదర్శన నిర్వహించారన్న ఆరోపణలపై నమోదైన కేసులో పలువురు నేతలకు ఊరట లభించింది. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రదర్శన నిర్వహించారంటూ 2015లో హనుమకొండ పోలీస్‌స్టేషన్‌లో నాయకులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, బలరాం నాయక్‌, పొదెం వీరయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, జి.విజయరామారావు, సిరిసిల్ల రాజయ్యలపై కేసు నమోదైంది. అభియోగాలు రుజువు కాకపోవడంతో నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు బుధవారం ఆ కేసును కొట్టివేసింది. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారంటూ ఆయనపై నమోదైన కేసునూ కొట్టివేసింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని