పోలీసుల త్యాగాలను జాతి మరవదు: సీఎం

ప్రధానాంశాలు

పోలీసుల త్యాగాలను జాతి మరవదు: సీఎం

ఈనాడు, హైదరాబాద్‌: పోలీస్‌ అమరుల త్యాగాలను జాతి ఎన్నటికీ మరవదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. ఈ నెల 21న పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వారి సేవల్ని బుధవారం ఆయన స్మరించుకొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్‌ అమరులకు ఘనంగా నివాళులు అర్పించారు. అమరులైన పోలీసుల కుటుంబాలను ఆదుకోవడానికి, వారి సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని