తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారాల ప్రకటన

ప్రధానాంశాలు

తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారాల ప్రకటన

నారాయణగూడ, న్యూస్‌టుడే: తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో ఉత్తమ గ్రంథాలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2018 సంవత్సరానికి సాహితీ పురస్కారాలు ప్రకటించింది. పద్యకవితాప్రక్రియలో మొవ్వ వృషాద్రిపతి రచన ‘శ్రీకృష్ణదేవరాయ విజయప్రబంధం’, వచన కవితా ప్రక్రియలో కాంచనపల్లి గోవర్ధన్‌రాజు ‘కల ఇంకా మిగిలే ఉంది’, బాలసాహిత్యంలో సామలేటి లింగమూర్తి ‘పాటల పల్లకి’, కథానికా ప్రక్రియలో రావులపాటి సీతారామారావు ‘ఖాకీకలం’, నవలా ప్రక్రియలో డా.గడ్డం మోహన్‌రావు ‘కొంగవాలు కత్తి’, సాహితీ విమర్శలో డా.కిన్నెరశ్రీదేవి ‘సీమకథ అస్తిత్వం’, నాటికల్లో నారాయణబాబు ‘అశ్శరభశరభ’, అనువాదంలో సజయ ‘అశుద్ధ భారత్‌’, వచన రచనల విభాగంలో లక్ష్మణరావు ‘హైదరాబాద్‌ నుంచి తెలంగాణ దాక..’, రచయిత్రి ఉత్తమగ్రంథం విభాగంలోఉమాదేవి ‘రేలపూలు’ గ్రంథాలు ఎంపికయ్యాయని వర్సిటీ ఉపాధ్యక్షులు ఆచార్య కిషన్‌రావు తెలిపారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని