యాదాద్రి విమాన గోపురానికి సమకూరిన 36 కిలోల పసిడి

ప్రధానాంశాలు

యాదాద్రి విమాన గోపురానికి సమకూరిన 36 కిలోల పసిడి

కిలో చొప్పున ప్రకటించిన ఎమ్మెల్యే దానం, ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌-కాచిగూడ, పెద్దవూర(రూరల్‌), న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు మేరకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి విమాన గోపురం స్వర్ణతాపడం కోసం బంగారం విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. కిలో చొప్పున బంగారాన్ని విరాళంగా ఇచ్చేందుకు గురువారం ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, ఖైరతాబాద్‌ శాసనసభ్యుడు దానం నాగేందర్‌ ముందుకొచ్చారు. తమ కుటుంబం, శ్రీని ఫార్మా గ్రూపు సంస్థ తరఫున విరాళం ఇస్తున్నామని చిన్నపరెడ్డి తెలిపారు. కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని యాదాద్రి నరసింహుడిపై భక్తితో బంగారం అందజేస్తున్నట్లు దానం పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన బ్రాహ్మణులు మూడు కిలోల బంగారం ఇస్తున్నట్లు భారత బ్రాహ్మణ సంస్థాన్‌, బ్రాహ్మణ సంక్షేమ భవన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు గిరిప్రసాద్‌శర్మ ప్రకటించారు. తనతో పాటు నీలామంగై, సౌమ్యలత, హర్షిత, లక్ష్మీనారాయణ, జయతులసి చంద్రశేఖర్‌ తదితర దాతలు బంగారం ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు చెప్పారు. దాతలు 36.16 కిలోల బంగారాన్ని విరాళంగా ప్రకటించారని సీఎం కార్యాలయం వెల్లడించింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని