Samantha Case: కోర్టు ముందు అందరూ సమానులే

ప్రధానాంశాలు

Samantha Case: కోర్టు ముందు అందరూ సమానులే

సమంత పరువునష్టం కేసులో న్యాయమూర్తి వ్యాఖ్య

కూకట్‌పల్లి, న్యూస్‌టుడే: కోర్టు ముందు అందరూ సమానులే అని కూకట్‌పల్లి కోర్టు న్యాయమూర్తి స్పష్టంచేశారు. డాక్టర్‌ సీఎల్‌ వెంకట్రావుతోపాటు సుమన్‌ టీవీ, తెలుగు పాపులర్‌ టీవీ యూట్యూబ్‌ ఛానళ్లపై సినీ నటి సమంత పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ త్వరగా చేపట్టాలని సమంత తరఫు న్యాయవాది కోరగా.. న్యాయమూర్తి ఈ వ్యాఖ్య చేశారు. సమంత, అక్కినేని నాగచైతన్యలు తమ వైవాహిక జీవితం ముగింపుపై ట్విటర్‌లో ప్రకటన చేసిన తర్వాత.. పైన పేర్కొన్న ఛానళ్లలో అసత్య ప్రచారాలు చేస్తూ సమంత పరువుకు నష్టం కలిగించేలా వ్యవహరించారని న్యాయవాది పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఆడియోలన్నీ తక్షణమే తొలగించాలని, బహిరంగ క్షమాపణ చెప్పేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. సమంత సెలబ్రిటీ కావడంతో భవిష్యత్తులో ఆమెకు, ఆమె కుటుంబానికి పరువు నష్టం కలిగేలా వ్యవహరించకుండా.. అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేసేందుకు శాశ్వత ఇంజంక్షన్‌ ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని