పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

ప్రధానాంశాలు

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

గవర్నర్‌ తమిళిసై, హోంమంత్రి మహమూద్‌అలీ, డీజీపీ

గోషామహల్‌, న్యూస్‌టుడే: విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని గవర్నర్‌ తమిళిసై, హోంమంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకొని గురువారం గోషామహల్‌ పోలీసు స్టేడియంలోని స్మారక స్తూపం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు వేర్వేరుగా పాల్గొన్నారు.  పోలీసు వందనం అనంతరం అమరవీరుల స్మారక స్తూపం వద్ద గవర్నర్‌ శ్రద్ధాంజలి ఘటించారు. హోంమంత్రి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా గతేడాది 377 మంది పోలీసులు వీరమరణం పొందారని, వారందరికీ పేరుపేరునా శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలో నిరుడు సెప్టెంబరు 1 నుంచి ఈ ఏడాది ఆగస్టు 31 వరకు కొవిడ్‌ కారణంగా విధి నిర్వహణలో 62 మంది పోలీసులు మరణించగా, వారి కుటుంబాలను ఆదుకునేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు వివరించారు. డీజీపీ కార్యాలయంలో ఐటీ విభాగంలో పనిచేస్తోన్న వెంకటేశ్‌ అనే ఉద్యోగి కుమార్తె చిన్నారి సాన్వీ చిన్నప్పటి నుంచి పెద్ద పోలీసు అధికారిని అవుతానంటూ చెబుతుండేది. ఆ ఆసక్తిని గమనించిన తండ్రి ఆమెకు పోలీస్‌ యూనిఫాం కుట్టించారు. డీజీపీ అనుమతి తీసుకుని ఈ కార్యక్రమానికి తీసుకురాగా గవర్నర్‌ సహా అందరూ ఆ చిన్నారిని చూసి ముచ్చటపడ్డారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని