బొగ్గు వినియోగంలో జైపూర్‌ ఎస్టీపీపీ ఘనత

ప్రధానాంశాలు

బొగ్గు వినియోగంలో జైపూర్‌ ఎస్టీపీపీ ఘనత

జైపూర్‌, న్యూస్‌టుడే: బొగ్గును సమర్థంగా వినియోగించుకొని విద్యుదుత్పత్తి చేస్తున్నందుకు మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్‌ విద్యుత్తు కేంద్రాని(ఎస్టీపీపీ)కి అరుదైన గుర్తింపు దక్కింది. శుక్రవారం నిర్వహించిన దృశ్యమాధ్యమ సమావేశంలో ముంబయికి చెందిన ‘కౌన్సిల్‌ ఆఫ్‌ ఎన్విరో ఎక్సలెన్స్‌’ అనే సంస్థ ఎస్టీపీపీ జాతీయస్థాయిలో ఎనర్జీ ఎఫిషియెన్సీ అవార్డుకు ఎంపికైనట్లు ప్రకటించిందని సంచాలకుడు ఈఅండ్‌ఎం డి.సత్యనారాయణరావు తెలిపారు. దక్షిణ భారతదేశంలోని 500 మెగావాట్ల పైచిలుకు ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్లలో ఉత్పత్తి సంబంధిత అంశాలను అధ్యయనం చేసే ఆ సంస్థ ప్రోత్సాహకంగా అవార్డులను అందజేస్తుందని ఆయన అన్నారు. 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్‌ ఒక యూనిట్‌ విద్యుదుత్పత్తికి 2,444 కిలో క్యాలరీల శక్తిని(బొగ్గు) వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. జైపూర్‌లోని ఎస్టీపీపీలోని ఒకటో యూనిట్‌ 2,425 క్యాలరీల శక్తినే వినియోగించుకుంటుందని వివరించారు. తక్కువ బొగ్గుతో అవసరమైన ఉష్ణోగ్రతను సాధించడంతో పాటు ప్లాంట్‌ అవసరాలకు ఉపయోగించే విద్యుత్తు, ఆయిల్‌ను పొదుపుగా వాడుకున్నందుకు కూడా ఈ అవార్డు వరించిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, కార్మికులను సింగరేణి సంస్థ సీఎండీ శ్రీధర్‌ అభినందించినట్లు డి.సత్యనారాయణ తెలిపారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని