ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఆదివాసీ భవన్‌

ప్రధానాంశాలు

ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఆదివాసీ భవన్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: అడవులు, ప్రకృతి పట్ల ఆదివాసీ బిడ్డలకు ఉండే ప్రేమ గొప్పదని.., వారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ కలసి ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. వారి ఆత్మగౌరవాన్ని నిలిపేలా హైదరాబాద్‌ నడిబొడ్డున ఆదివాసీ భవన్‌ నిర్మాణం చేపట్టామని.. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని వెల్లడించారు. శుక్రవారం కుమురంభీం జయంతి సందర్భంగా ఆయన సేవల్ని స్మరించుకుంటూ సీఎం నివాళులు అర్పించారు. ‘‘భీం ఆశయసాధనకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ‘మా గూడెం.. మా తండాలో మా రాజ్యం’ అనే ఆదివాసీల తరతరాల ఆకాంక్షను నిజం చేశాం. ఆదివాసీల సంక్షేమం, అభివృద్ద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలుపరిచాం. భీం జయంతిని అధికారికంగా నిర్వహించడంతో పాటు ఆయన పోరాట పటిమను భవిష్యత్‌ తరాలకు తెలియచేసేలా జోడే ఘాట్‌ను అభివృద్ధి చేశాం’’ అని కేసీఆర్‌ వివరించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని