గుడుంబా రహితం స్ఫూర్తితో గంజాయి నిర్మూలన

ప్రధానాంశాలు

గుడుంబా రహితం స్ఫూర్తితో గంజాయి నిర్మూలన

ఎక్సైజ్‌ శాఖ సమీక్షలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వెల్లడి  

ఈనాడు, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో తెలంగాణను గుడుంబా రహితం చేశామని, అదే స్ఫూర్తితో గంజాయి నిర్మూలనపై దృష్టి పెట్టాలని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో గంజాయిని నిర్మూలించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ గురించి శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గంజాయి, మత్తు పదార్థాల ఉత్పత్తి, అక్రమసాగు, రవాణా, అమ్మకాలు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని చెప్పారు. ఆంధ్రా- ఒడిశా సరిహద్దు నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్ర, కర్ణాటకకు గంజాయి సరఫరా అవుతోందని, ఆ వ్యవహారంపై దృష్టి సారించాలన్నారు. పోలీస్‌శాఖతో సమన్వయం చేసుకొని కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని