కవ్వాల్‌ టైగర్‌ రిజర్వులో రెండు గ్రామాల తరలింపు

ప్రధానాంశాలు

కవ్వాల్‌ టైగర్‌ రిజర్వులో రెండు గ్రామాల తరలింపు

ఈనాడు, హైదరాబాద్‌: మధ్యప్రదేశ్‌లోని కన్హా టైగర్‌ రిజర్వు నుంచి గ్రామాల తరలింపుపై అధ్యయనం చేసివచ్చిన రాష్ట్ర అటవీశాఖ అధికారులు ‘కవ్వాల్‌’పై దృష్టి సారించారు. పైలట్‌ ప్రాజెక్టు కింద ఈ టైగర్‌ రిజర్వులో పులులు సంచరించే కోర్‌ ఏరియాలో ఉన్న నిర్మల్‌ జిల్లా కడెం మండలం మైసంపేట, రాంపూర్‌ గ్రామాల్లోని 142 కుటుంబాలను బఫర్‌ ఏరియాకు తరలించనున్నారు. నిర్వాసితులకు నగదు పరిహారంతో పాటు వారు కోల్పోయే భూమికి సమానంగా భూమి ఇవ్వనున్నారు. పరిహారాన్ని పాత విధానం ప్రకారం రూ.10 లక్షలు ఇవ్వాలా? కొత్త విధానం మేరకు రూ.30 లక్షలు ఇవ్వాలా? అన్న అంశంపై జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ(ఎన్టీసీఏ) నుంచి స్పష్టత రాగానే నిర్మల్‌ కలెక్టర్‌ నోటిఫికేషన్‌ జారీ చేస్తారని అటవీశాఖ వర్గాలు తెలిపాయి. ఈ టైగర్‌ రిజర్వులో ప్రస్తుతం ఖానాపూర్‌, జన్నారం ప్రాంతాల్లో రెండు పులులు సంచరిస్తున్నాయని అటవీ అధికారి ఒకరు తెలిపారు. రిజర్వుకు అప్పుడప్పుడు పులులు వస్తున్నప్పటికీ.. మధ్యలో జనావాస ప్రాంతాలు ఉండటం కారణంగా స్థిరనివాసం ఏర్పాటు చేసుకోకుండా కొద్దిరోజులకే తిరిగి వెళ్లిపోతున్నాయి. రిజర్వులో మొత్తం 41 గ్రామాలున్నాయి. పైలట్‌ ప్రాజెక్టు విజయవంతమైతే మిగతా గ్రామాల తరలింపు సులభమవుతుందని అటవీశాఖ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని