దిగుబడి రాక.. పంటకు నిప్పు పెట్టిన యువరైతు

ప్రధానాంశాలు

దిగుబడి రాక.. పంటకు నిప్పు పెట్టిన యువరైతు

అడ్డాకుల, న్యూస్‌టుడే: తెగుళ్ల కారణంగా వరిపంట కనీస దిగుబడి రాలేదని మనస్తాపం చెందిన ఓ యువ రైతు పంటకు నిప్పు పెట్టారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకొంది. మూసాపేట మండలం జానంపేటకు చెందిన యువరైతు రమేశ్‌ తనకున్న మూడున్నర ఎకరాలతో పాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని వానాకాలం పంటగా వరి సాగు చేశారు. అధిక వర్షాల కారణంగా దోమకాటు, ఎర్ర తెగులు సోకింది. గింజ పట్టే సమయంలో తెగుళ్లు సోకడంతో రసాయనిక మందులు పిచికారీ చేయించారు. శుక్రవారం ఉదయం యంత్రంతో పంట కోత చేపట్టారు. ఎకరం పొలం కోసినా క్వింటా ధాన్యం దిగుబడి రాకపోవడంతో ఆవేదన చెందారు. యంత్రం ఖర్చు దండగ అనుకొని మిగిలిన పంటకు నిప్పంటించారు. ఎకరాకు రూ.25 వేలకు పైగా పెట్టుబడి పెట్టినట్లు రమేశ్‌ తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని