వినియోగదారుల కమిషన్‌ సభ్యుల పదవీకాలం కుదింపు

ప్రధానాంశాలు

వినియోగదారుల కమిషన్‌ సభ్యుల పదవీకాలం కుదింపు

ఈనాడు, హైదరాబాద్‌: వినియోగదారుల పరిరక్షణ కమిషన్‌ సభ్యుల పదవీకాలాన్ని 5 నుంచి నాలుగేళ్లకు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర కొత్త మార్గదర్శకాలను యథావిధిగా అమలు చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ వి.అనిల్‌కుమార్‌ శనివారం ఉత్తర్వులిచ్చారు. వినియోగదారుల పరిరక్షణ చట్టంలో సభ్యుల నియామకం నుంచి పలు నిబంధనలను మారుస్తూ కేంద్రం 2019లో చట్టసవరణ చేసింది. దీన్ని తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల పరిరక్షణ చట్టం-2020 పేరిట కార్యరూపంలోకి తెచ్చింది. గతంలో రాష్ట్రస్థాయి కమిషన్‌ ఛైర్మన్‌, సభ్యుల గరిష్ఠ వయోపరిమితి 67, జిల్లా స్థాయిలో 65 ఏళ్లుగా ఉంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో ఛైర్మన్‌, సభ్యుల గరిష్ఠ వయోపరిమితిని 65 సం.లుగా నిర్ణయించింది. ప్రతి కమిషన్‌లోనూ ఓ సభ్యురాలు ఉండాలి. రాష్ట్రస్థాయి కమిషన్‌ ఛైర్మన్‌ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి. జిల్లా కమిషన్‌ ఛైర్మన్‌ జిల్లా జడ్జిగా విధులు నిర్వర్తించి ఉండాలి.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని