నేడు, రేపు ఎండీఎస్‌ సీట్ల భర్తీకి వెబ్‌ కౌన్సెలింగ్‌

ప్రధానాంశాలు

నేడు, రేపు ఎండీఎస్‌ సీట్ల భర్తీకి వెబ్‌ కౌన్సెలింగ్‌

ప్రకటన జారీ చేసిన కాళోజీ వర్సిటీ

ఈనాడు, హైదరాబాద్‌: కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో దంత వైద్య పీజీ (ఎండీఎస్‌) కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 24, 25 తేదీల్లో తుది విడత వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు శనివారం కాళోజీ వర్సిటీ ప్రకటన జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రాధాన్య క్రమంలో కళాశాలల వారీగా వెబ్‌ ఐచ్ఛికాలను నమోదు చేసుకోవాలని సూచించింది. మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీటు కేటాయించినా.. చేరని అభ్యర్థులు, ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ కింద ఇప్పటికే చేరిన అభ్యర్థులు ఈ విడత వెబ్‌ కౌన్సెలింగ్‌కు అనర్హులని పేర్కొంది. పూర్తి సమాచారాన్ని www://knruhs.telangana.gov.in  వెబ్‌సైట్‌లో చూడాలని యూనివర్సిటీ పేర్కొంది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని