71 మున్సిపాలిటీల్లో మానవ వ్యర్థాల శుద్ధికేంద్రాలు

ప్రధానాంశాలు

71 మున్సిపాలిటీల్లో మానవ వ్యర్థాల శుద్ధికేంద్రాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 71 మున్సిపాలిటీల్లో పీపీపీ-హైబ్రిడ్‌ విధానంలో మానవ వ్యర్థాల శుద్ధి కేంద్రాలు(ఎఫ్‌ఎస్‌టీపీ) ఏర్పాటు చేయనున్నట్లు పురపాలక శాఖ కమిషనర్‌ డాక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ తెలిపారు. పట్టణ ప్రగతితో అన్ని పట్టణాలను క్రమపద్ధతిలో అభివృద్ధి చేసే కార్యక్రమం అమలు చేస్తున్నామన్నారు. మానవ వ్యర్థాల నిర్వహణ, హరితహారం తదితర కార్యక్రమాలను పరిశీలించేందుకు అస్సాం, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, దిల్లీ రాష్ట్రాలకు చెందిన అధికారులు, యునిసెఫ్‌ ప్రతినిధులు రాష్ట్రపర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా వారు ఆస్కి ప్రొఫెసర్‌ డాక్టర్‌ వై.మాలినిరెడ్డితో కలిసి పురపాలకశాఖ కమిషనర్‌తో శనివారం సమావేశమయ్యారు. పట్టణ అభివృద్ధి, వ్యర్థాల నిర్వహణపై ప్రభుత్వం చేపడుతున్న చర్యల్ని అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య సౌకర్యాల పరిశీలనకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పట్టణ ప్రగతి టాయిలెట్‌ పర్యవేక్షణ వ్యవస్థ యాప్‌(పీపీటీఎంఎస్‌) సిద్ధం చేశామని సత్యనారాయణ వారికి తెలిపారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని