ఫోరెన్సిక్‌ సైన్స్‌ వర్సిటీలో గురుకుల విద్యార్థులకు ప్రవేశాలు

ప్రధానాంశాలు

ఫోరెన్సిక్‌ సైన్స్‌ వర్సిటీలో గురుకుల విద్యార్థులకు ప్రవేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: గుజరాత్‌లోని జాతీయ ఫోరెన్సిక్‌ సైన్స్‌ విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది 14 మంది ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యార్థులు ప్రవేశం పొందారని గురుకులాల సొసైటీ కార్యదర్శి రొనాల్డ్‌రాస్‌ తెలిపారు. ఎస్సీ గురుకులాల నుంచి 10 మంది, ఎస్టీ గురుకులాల నుంచి నలుగురు ఎంపికయ్యారని వివరించారు. వీరు ఐదేళ్లు ఇంటిగ్రేటెడ్‌ సైబర్‌ సెక్యూరిటీ ఎంటెక్‌ కోర్సు చదువుతారని పేర్కొన్నారు. గురుకుల విద్యాలయాల ఏర్పాటుతో పేద విద్యార్థులు మంచి విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందుతున్నారని వివరించారు. విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతుల నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం కూడా వారికి అవసరమైన సహకారమందిస్తోందని పేర్కొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని