నలుగురు ఐఏఎస్‌ల బదిలీలు

ప్రధానాంశాలు

నలుగురు ఐఏఎస్‌ల బదిలీలు

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా భవేశ్‌ మిశ్రా

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో నలుగురు ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈమేరకు శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా భవేశ్‌ మిశ్రా నియమితులయ్యారు. వనపర్తి అదనపు కలెక్టర్‌ అంకిత్‌ను ఉట్నూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా బదిలీ చేసింది. ఆయన స్థానంలో అశీష్‌ సంగ్వాన్‌ను నియమించింది. మంచిర్యాల అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠిని ములుగు జిల్లా అదనపు కలెక్టర్‌గా నియమించింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని