106 ఏళ్ల వెంటరమణమ్మకు 186 మంది కుటుంబ సభ్యులు

ప్రధానాంశాలు

106 ఏళ్ల వెంటరమణమ్మకు 186 మంది కుటుంబ సభ్యులు

నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరు మండలం సిర్సవాడ కాలనీకి చెందిన 106 ఏళ్ల వెంకటరమణమ్మ నేటికీ ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. తన పనులన్నీ స్వయంగా చేసుకుంటారు. 1914లో జన్మించిన ఆమెకు ఏడుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. వారి కుమారులు, కుమార్తెలు, కోడళ్లు, అల్లుళ్లు, మనవలు, మునిమనవలు అంతా కలిపి కుటుంబ సభ్యులు 186 మంది అవుతారు. నూరేళ్లు పైబడిన వెంకటరమణమ్మకు ఘనంగా వేడుక నిర్వహించాలని అంతా కలసి ఆదివారం ఆమె చెంతకు చేరుకున్నారు. ఘనంగా సన్మానించి, రోజంతా ఆమెతో ఆనందంగా గడిపారు. కుటుంబ సభ్యులందరి మధ్య వేడుక చేసుకోవటం పట్ల వెంకటరమణమ్మ సంతోషం ప్రకటించారు. 

- న్యూస్‌టుడే, తాడూరు

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని