మత్స్యకారులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు

ప్రధానాంశాలు

మత్స్యకారులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు

కేంద్ర సహాయ మంత్రి మురుగన్‌ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో మత్స్యకారులందరికీ కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు ఇస్తామని, సాధారణ పంటలు పండించే రైతులకు ఏయే సదుపాయాలున్నాయో అవన్నీ వర్తింపజేస్తామని కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి ఎల్‌.మురుగన్‌ వెల్లడించారు. రాజేంద్రనగర్‌లోని ‘జాతీయ మత్స్య అభివృద్ధి మండలి’(ఎన్‌ఎఫ్‌డీబీ)లో ఆదివారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘అతి త్వరలో ఈ కార్డులను పంపిణీ చేస్తాం. మన దేశం నుంచి సముద్ర ఉత్పత్తుల ఎగుమతులను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. దేశ తీర ప్రాంతంలో అయిదు చోట్ల చేపల రేవులను అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తాం. వీటిలో శీతల గిడ్డంగులు, మత్స్య శుద్ధి ప్లాంట్లు తదితర సదుపాయాలు కల్పిస్తాం. తమిళనాడులో ‘సీవుడ్‌’ (సముద్రంలో పెరిగే నాచు లాంటి మొక్కల) పెంపకం పార్కు ఏర్పాటు చేస్తాం. ఇలాంటివి దేశంలో మరిన్ని నెలకొల్పాలని ప్రణాళిక రచిస్తున్నాం. సీవుడ్‌ను, కేజ్‌ విధానంలో రొయ్యలను అధునాతన పద్ధతుల్లో పెంచుతారు. ఔషధ విలువలతో కూడిన సీవుడ్‌కు అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ డిమాండ్‌ ఉంది’ అని మంత్రి వివరించారు. ఈ సందర్భంగా బిహార్‌లోని కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన మంచినీటి రొయ్యల హ్యాచరీని ఆన్‌లైన్‌ ద్వారా మంత్రి ప్రారంభించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని