ప్రత్యామ్నాయ పంటలపై నేడు సీఎస్‌ సమీక్ష

ప్రధానాంశాలు

ప్రత్యామ్నాయ పంటలపై నేడు సీఎస్‌ సమీక్ష

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై సోమవారం జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ భేటీ కానున్నారు. దీనిలో భాగంగా హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో విత్తన కంపెనీలతో సమావేశమైన సీఎస్‌... విత్తనాల లభ్యతపై సమీక్ష నిర్వహించారు. యాసంగి సీజన్‌లో రాష్ట్రంలో పండించే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని.. 36 విత్తన కంపెనీలతో సమావేశమైనట్లు ఆయన వివరించారు. ప్రత్యామ్నాయ పంటలైన అపరాలు, నూనెగింజల సాగుకు విత్తనాలను అందుబాటులో ఉంచాలని కంపెనీల ప్రతినిధులను కోరారు. వేరుశనగ, పెసలు, మినుములు, శనగలు, నువ్వులు, ఆముదం, సజ్జలు, నూనెగింజలు తెలంగాణలో యాసంగిలో సాగుకు అనుకూలమైనవిగా ఆయన పేర్కొన్నారు. కలెక్టర్లతో పాటు వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు, శాస్త్రవేత్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సీఎస్‌ వెల్లడించారు. రాష్ట్రంలోని 2,603 రైతువేదికల ద్వారా 27, 28, 29 తేదీలలో రైతులకు, వ్యవసాయ విస్తరణ అధికారులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు వివరించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని