30న రైతు నేస్తం పురస్కారాలు

ప్రధానాంశాలు

30న రైతు నేస్తం పురస్కారాలు

ఈనాడు, అమరావతి: రైతు నేస్తం, ముప్పవరపు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 30న వ్యవసాయ, అనుబంధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గౌరవ అతిథిగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు హాజరు కానున్నారు. 16 మంది రైతులు, 9 మంది విస్తరణ విభాగంలోని వారు,  10 మంది శాస్త్రవేత్తలతోపాటు వ్యవసాయ జర్నలిజం నుంచి ఐదుగురిని పురస్కారాలకు ఎంపిక చేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని