ఆకు ఈనెలా.. ఆకట్టుకునేలా!

ప్రధానాంశాలు

ఆకు ఈనెలా.. ఆకట్టుకునేలా!

ఎండిపోయిన ఆకు ఈనెల్లా.. అల్లుకుపోతున్న గడ్డి మొక్కలా.. అనేక భావాలు ఒలికిస్తున్న ఈ ఆకారం ఓ కీటకానిది. రానున్న రోజుల్లో ఇది సీతాకోక చిలుకగా రూపాంతరం చెందుతుంది. ప్రస్తుతం ఈ కీటకం గొంగళి పురుగు దశగా చెబుతారు. మామిడి చెట్టు ఆకులపై ఈ పురుగు కనిపిస్తుంది. గజ్వేల్‌ పట్టణ ప్రాంతంలోని ఓ మామిడి చెట్టు ఆకులకు వేలాడుతూ కనిపించిన ఈ కీటకం అందరిని ఆకట్టుకుంది. ఆశ్చర్యంగా చూశారు. మ్యాంగో బారన్‌ క్యాటర్‌పిల్లర్‌గా పిలిచే దీని శాస్త్రీయ నామం యుథాలియా అకాంథియా అని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల జంతుశాస్త్ర అధ్యాపకులు డా.అయోధ్యరెడ్డి, విశ్వనాథం తెలిపారు. ఇది మామిడి ఆకులను ఆహారంగా తీసుకుంటుందని, ఇతర కీటకాహార పక్షుల నుంచి రక్షణ నిమిత్తం ఆకు ఈనెలను పోలి విస్తరిస్తుందని వివరించారు. గుడ్డులో నుంచి బయటకు వచ్చి ప్రస్తుత డింభకం(లార్వా) దశలో ఉందని, అనంతరం వ్యూపా.. తుది దశలో సీతాకోకచిలుకగా మారుతుందన్నారు.

- న్యూస్‌టుడే, గజ్వేల్‌

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని