నవంబరు 3 నుంచి ఐసెట్‌ కౌన్సెలింగ్‌

ప్రధానాంశాలు

నవంబరు 3 నుంచి ఐసెట్‌ కౌన్సెలింగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నవంబరు 3వ తేదీ నుంచి ఐసెట్‌-2021 కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి తెలిపారు. బుధవారమిక్కడ సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌మిత్తల్‌, ఇతర సభ్యులతో సమావేశమై కౌన్సెలింగ్‌ షెడ్యూలును ఖరారు చేశారు. తొలిదశ కౌన్సెలింగ్‌ ప్రక్రియ నవంబరు 3 నుంచి 18 వరకు, తుదిదశ 21 నుంచి 28 వరకు కొనసాగుతుందన్నారు. కౌన్సెలింగ్‌లలో సీట్లు పొందిన విద్యార్థులు నవంబరు 27, 28, 29 తేదీల్లోగా సంబంధిత కళాశాలల్లో చేరాలని స్పష్టం చేశారు. స్పాట్‌ అడ్మిషన్ల విధివిధానాలు నవంబరు 28న ప్రకటిస్తామని వెల్లడించారు.

కౌన్సెలింగ్‌ షెడ్యూలు వివరాలు

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని