Nitin Gadkari: ఎన్‌హెచ్‌గా మంచిర్యాల- విజయవాడ గ్రీన్‌ఫీల్డ్‌ అలైన్‌మెంట్‌

ప్రధానాంశాలు

Nitin Gadkari: ఎన్‌హెచ్‌గా మంచిర్యాల- విజయవాడ గ్రీన్‌ఫీల్డ్‌ అలైన్‌మెంట్‌

కేంద్ర మంత్రి గడ్కరీ ప్రకటన

ఈనాడు, దిల్లీ: నాగ్‌పుర్‌-విజయవాడ కారిడార్‌లో భాగంగా మంచిర్యాల నుంచి విజయవాడ వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా సాగే గ్రీన్‌ఫీల్డ్‌ అలైన్‌మెంట్‌ను జాతీయ రహదారిగా ప్రకటిస్తూ ముసాయిదా నోటిఫికేషన్‌ జారీచేశామని కేంద్ర రహదారి, రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ శనివారం ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. అలాగే.. అమలాపురం(ఎన్‌హెచ్‌216) దగ్గరి నుంచి పలివెల మీదుగా రావులపాలెం వరకు (ఎన్‌హెచ్‌216ఎ) ఉన్న మార్గాన్ని, పెడన (ఎన్‌హెచ్‌216) నుంచి విస్సన్నపేట మీదుగా లక్ష్మీపురం (ఎన్‌హెచ్‌30)వరకు ఉన్న మార్గాన్ని జాతీయ రహదారులుగా ప్రకటిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని