TS News: తెలంగాణలో నేడు భారీ వర్షాలు!

ప్రధానాంశాలు

TS News: తెలంగాణలో నేడు భారీ వర్షాలు!

ఈనాడు, హైదరాబాద్‌: బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్‌ తీరం వద్ద అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా గాలులతో ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకూ వ్యాపించింది. అల్పపీడన ప్రాంతం నుంచి ఒడిశా మీదుగా తెలంగాణ వరకూ 3.1 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణలో బుధవారం అక్కడక్కడ భారీగా, గురువారం ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు. మంగళవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ అక్కడక్కడ ఓ మాదిరి వర్షాలు కురిశాయి. అత్యధికంగా దోమలపల్లి(నల్గొండ జిల్లా)లో 4.9, నల్గొండలో 4.8, కోహెడ(సిద్దిపేట)లో 4.3, రావినూతల(ఖమ్మం)లో 4.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అంతకుముందు సోమవారం ఉదయం 8 నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా చిట్కుల్‌ (మెదక్‌)లో 14.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని