Weather Forecast: నేడూ, రేపూ ఓ మోస్తరు వర్షాలు

ప్రధానాంశాలు

Weather Forecast: నేడూ, రేపూ ఓ మోస్తరు వర్షాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఉత్తర తెలంగాణపై అల్పపీడనం కేంద్రీకృతమైంది. దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకూ గాలులతో ఉపరితల ఆవర్తనం ఉంది. బంగాళాఖాతం నుంచి గాలులతో ఉపరితల ద్రోణి ఈ ఆవర్తనం వరకూ 1500 మీటర్ల ఎత్తున ఏర్పడింది. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.  

సాగర్‌ గేట్ల మూసివేత

నాగార్జునసాగర్‌, న్యూస్‌టుడే: నాగార్జునసాగర్‌ డ్యాం క్రస్ట్‌ గేట్ల ద్వారా నీటి విడుదలను అధికారులు ఆదివారం నిలిపివేశారు. సెప్టెంబరు 19 నుంచి ఈ నెల 17 వరకూ సుమారు 92 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు జలాశయ నీటిమట్టం 589.70 (గరిష్ఠం 590.00) అడుగులు నమోదైంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని