
ప్రధానాంశాలు
ఈ చిత్రంలో కనిపిస్తున్న స్తూపం 118 ఏళ్ల కిందటిది. ఓ ఘోర ప్రమాదానికి గుర్తు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఈ స్తూపం ప్రస్తుతం గండికోట వెనుక జలాల్లో ముంపునకు గురైంది. భారతదేశాన్ని బ్రిటీష్ వారు పరిపాలిస్తున్న సమయంలో మద్రాసు నుంచి ముంబయికి ‘మెయిల్’ రైలు ప్రయాణికులతో బయలుదేరింది. 1902 సంవత్సరం సెప్టెంబరు 12వ తేదీన కడప జిల్లా మంగపట్నం రైల్వేస్టేషన్‌కు చేరింది. ఆ సమయంలో జోరుగా వర్షం పడటంతో .. వరద నీటిలో మంగపట్నం సమీపంలోని రైల్వే వంతెన కొట్టుకుపోయింది. అదే దారిలో వచ్చిన రైలు ప్రమాదానికి గురైంది. పది మంది యూరోపియన్లు, 61 మంది హిందువులు, ముస్లింలు మృతి చెందారు. ప్రమాద ప్రాంతంలోనే వారిని ఖననం చేసి స్తూపాన్ని నిర్మించారు. ఈ ప్రమాదంలో ఆంగ్లో-ఇండియన్ థెరిస్సా లీమా సిస్టర్ ప్రాణాలు కోల్పోయారు. ఆమె బెంగళూరులో కార్మెలైట్ సిస్టర్స్ ఆఫ్ థెరిస్సా (సీఎస్‌ఎస్‌టీ) సంస్థ అధిపతి. ఈ సంస్థ ఆధ్వర్యంలో భారత్‌లో సుమారు 115 పాఠశాలలు నడుస్తున్నాయి. ఆమె జ్ఞాపకార్థం 2003లో మంగపట్నం వద్ద ఆంగ్ల మాధ్యమ పాఠశాలను ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా సెప్టెంబరు 12న స్తూపం వద్ద అంజలి ఘటించేవారు. గండికోట జలాల్లో స్తూపం మునగడంతో పాఠశాల యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేస్తోంది. స్తూపాన్ని సంరక్షించాలని కోరుతోంది.
- న్యూస్‌టుడే, కొండాపురం
ప్రధానాంశాలు
దేవతార్చన

- మాగంటిబాబు కుమారుడి కన్నుమూత
- సొంతవాళ్లే నన్ను మోసం చేశారు: రాజేంద్రప్రసాద్
- ఆఫర్ కోసం చిరు, పవన్‌లకు కాల్ చేశా: కోట
- తెలుగు హీరోయిన్ కోసం బన్నీ పట్టుబట్టాడు
- అఫ్రిది అల్లుడవుతున్న షహీన్
- ఆచార్య ఫొటో వైరల్.. ఇలియానా బెంగ
- జూమ్‌కాల్‌లో భోజనం.. విస్తుపోయిన సొలిసేటర్!
- రెండు సెకన్లకు ఒక ఈ-స్కూటర్!
- ఆ సినిమా ఫ్లాప్..నితిన్‌కి ముందే తెలుసు
- ఆమె నవ్వితే లోకమంతా ఆనందం