బుసలుకొట్టలేని పాము.. అదే ఈల్‌!
close

ప్రధానాంశాలు

బుసలుకొట్టలేని పాము.. అదే ఈల్‌!

పాముల్లా కనిపిస్తున్నా.. ఇవీ చేపలే. తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ రేవులో ఓ మత్స్యకారుడి వలకు బుధవారం చిక్కాయి. సుమారు 5 అడుగుల పొడవు ఉన్న వీటిని మత్స్యకారులు తెల్లపాము, నల్లపాములుగా పిలుస్తారు. గుంటూరు మత్స్యశాఖ ఏడీ లక్ష్మణ్‌కుమార్‌ దృష్టికి వీటిని తీసుకెళ్లగా.. ఇవి ఈల్‌ చేపలని, వీటి శరీరంలోని తెల్లటి గాలి బుడగలను వేరుచేసి ఔషధాల తయారీకి వాడతారని తెలిపారు. బుడగలను వేరు చేశాక మిగిలిన చేపలకు తమిళనాడు, కేరళలో మంచి డిమాండ్‌ ఉంటుందన్నారు. పదేళ్ల కిందటితో పోల్చితే ప్రస్తుతం చాలా అరుదుగా లభిస్తున్నాయని వివరించారు.

- న్యూస్‌టుడే, కొత్తపల్లి


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని