వేకువన లేస్తేనే.. టీకా దక్కేది..

ప్రధానాంశాలు

వేకువన లేస్తేనే.. టీకా దక్కేది..

దేశంలో రోజువారీ కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. క్రియాశీలక కేసుల సంఖ్యతో పాటు పాజిటివిటీ రేటు పెరుగుతోండటంతో హైదరాబాద్‌ వాసులు కరోనా వ్యాక్సిన్‌ కోసం పరుగులు పెడుతున్నారు. ఉదయం ఆరింటికే వెళ్లినా టీకాలు లభించకపోతుండటంతో.. నిద్ర మానుకుని వేకువజామున 3:30 గంటల నుంచే వివిధ ఆరోగ్య కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. అయినా తగినన్ని డోసులు రాలేదంటూ అక్కడి సిబ్బంది అనేక మందిని తిప్పి పంపుతున్నారని.. టీకా వేయించుకునేందుకు కనీసం మూడు, నాలుగు రోజుల సమయం పడుతోందని వాపోతున్నారు. ఇదే పరిస్థితిలో తెల్లవారక ముందే సరూర్‌నగర్‌ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం వద్ద బారులు తీరిన నగరప్రజల్ని చిత్రంలో చూడవచ్చు.

- ఈనాడు, హైదరాబాద్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని