అడవిని సృష్టించారు.. స్ఫూర్తి నింపారు

ప్రధానాంశాలు

అడవిని సృష్టించారు.. స్ఫూర్తి నింపారు

మూడేేళ్ల క్రితం తెలంగాణలో మియావకీ విధానంలో మొదటగా పెంచిన వనం నేడు చిట్టడవిని తలపిస్తూ సత్ఫలితాలిస్తోంది. 2018-19లో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ అటవీక్షేత్రం పరిధి లక్కారంలో ‘తంగేడువనం’ పేరిట అటవీశాఖ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఎకరంలో నాలుగు వేలకు పైగా మొక్కలు నాటారు. గతంలో ఈ ప్రదేశం రాళ్లు రప్పలతో ఉండేది. నిస్సారమైన ఈ నేలను రెండు అడుగుల లోతు తవ్వి ‘సుపోషకం’ చేశారు. స్థానిక వాతావరణ పరిస్థితులను తట్టుకుని పెరిగే మొక్కలు ఎంపిక చేసి నాటారు. వారానికోసారి నీటి తడులిచ్చారు. ఈ మొక్కలు ఏపుగా పెరగడంతో జాతీయ రహదారి పక్కనే ఈ ప్రదేశం ఇప్పుడు చిట్టడవిలా మారింది. సందర్శకులు ఇందులో సేద తీరడానికి చక్కగా కర్రలతో ఓ గుడిసె నిర్మాణం చేశారు. ఈ వనం సీఎం దృష్టికి వెళ్లడంతో ఆయన దీనికి ‘యాదాద్రి మోడల్‌’ పార్కుగా నామకరణం చేసి రాష్ట్రమంతటా ఇలాంటి ఉద్యానవనాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చారు. ఆ స్ఫూర్తితోనే ప్రతి గ్రామ పంచాయతీలో ఒక పల్లె ప్రకృతి వనం ఏర్పాటవుతోంది. ఎకరం విస్తీర్ణంలో చిట్టడవి పెంచేందుకు రూ.2.50 లక్షలు ఖర్చు చేసినట్లు అటవీశాఖాధికారులు తెలిపారు. దీన్ని పరిశీలించేందుకు దేశం నలుమూలల నుంచి వివిధ శాఖల అధికారులు లక్కారం వస్తున్నారు.

- ఈనాడు, సూర్యాపేట, చౌటుప్పల్‌, న్యూస్‌టుడే


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని