ఏకాంతంగా గడపడమంటే మాకెంతో ఇష్టం! - ఏకాంతంగా గడపడమంటే మాకెంతో ఇష్టం! priyanka chopra shares secret behind her relationship with nick jon
close
Published : 24/06/2021 13:53 IST

ఏకాంతంగా గడపడమంటే మాకెంతో ఇష్టం!

ఆలుమగల అనుబంధం పటిష్టంగా ఉండాలంటే ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకోవాలి. ఇష్టాలు, అభిరుచులు భాగస్వామితో పంచుకోవాలి. ఏ విషయాన్నైనా కలిసి చర్చించుకోవాలి. అలా ఒకరికొకరు మనసు విప్పి మాట్లాడుకున్నప్పుడే భార్యాభర్తల మధ్య అనుబంధం మరింత బలపడుతుంది. తమ అన్యోన్య దాంపత్యానికి ఈ సూత్రమే కారణమంటోంది గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంకా చోప్రా. తన భర్త నిక్‌ జొనాస్‌తో కలిసి ఏకాంతంగా మాట్లాడడమంటే తనకు బాగా ఇష్టమంటోంది. అదే తమ ఇద్దరి మధ్య అన్యోన్యతను పెంచిదంటోందీ ముద్దుగుమ్మ.

బాలీవుడ్‌కు సంబంధించి ప్రేమ వివాహం చేసుకున్న జంటల్లో ప్రియాంక-నిక్‌ జొనాస్‌ జోడీ ఒకటి. 2018 డిసెంబర్‌లో పెళ్లిపీటలెక్కిన ఈ లవ్లీ కపుల్‌ తమ దాంపత్య జీవితాన్ని నిత్యనూతనం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఎక్కడికెళ్లినా జంటగానే కనిపిస్తూ, సోషల్‌ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు ప్రేమను కురిపిస్తూ.. నేటి దంపతులకు రిలేషన్‌షిప్ పాఠాలు నేర్పుతున్నారీ రొమాంటిక్‌ కపుల్‌. ఈ సందర్భంగా తమ అన్యోన్య దాంపత్య జీవితం వెనక ఉన్న సీక్రెట్స్‌ను తాజాగా షేర్‌ చేసుకుంది ప్రియాంక.

అదే మా అనుబంధాన్ని బలంగా మార్చింది!

‘మా ఇద్దరి మధ్య అన్యోన్యతకు కారణమేంటని చాలామంది అడుగుతుంటారు. అయితే మేం వివాహ బంధంలోకి అడుగుపెట్టి కేవలం రెండేళ్లే అయింది. కాబట్టి ఈ కొద్ది సమయంలో మా ఇద్దరి మధ్య అన్యోన్యతను పెంచిన కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. నా వరకు భార్యాభర్తల బంధం పటిష్టంగా ఉండాలంటే వారిద్దరి మధ్య జరిగే సంభాషణ ఎంతో ముఖ్యం. ఇద్దరూ ఏకాంతంగా మనసు విప్పి మాట్లాడుకుంటే ఒకరి గురించి మరొకరికి తెలుస్తుంది. నేను, నిక్‌ అలానే చేస్తాం. ఏకాంతంగా కూర్చొని మాట్లాడుకోవడాన్ని మేమిద్దరం బాగా ఇష్టపడతాం. అందుకోసమే ఎక్కువగా సమయం కేటాయించుకుంటాం. బహుశా అదే మా బంధాన్ని దృఢంగా మార్చిందనుకుంటున్నా’ అంటూ తమ రిలేషన్‌షిప్‌ సీక్రెట్‌ను బయటపెట్టిందీ అందాల తార.

రెండు నెలల్లోనే పూర్తయ్యాయి!

2017లో లాస్‌ ఏంజెల్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మొదటిసారిగా కలుసుకున్నారు నిక్‌, ప్రియాంక. ఒకరిపై ఒకరు ఇష్టం పెంచుకుని ప్రేమలో మునిగితేలారు. ఆ మరుసటి ఏడాదే జోధ్‌పూర్‌ ప్యాలస్‌ వేదికగా పెళ్లిపీటలెక్కారీ లవ్లీ కపుల్‌. మొదట హిందూ సంప్రదాయం, ఆతర్వాత క్రిస్టియన్‌ సంప్రదాయం ప్రకారం ఏడడుగులు నడిచారీ రొమాంటిక్‌ కపుల్‌. ఈక్రమంలో అట్టహాసంగా జరిగిన తన వివాహ వేడుకపై ప్రియాంక స్పందిస్తూ ‘మా పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లన్నీ రెండు నెలల్లోనే పూర్తయ్యాయి. తక్కువ సమయం ఉండడంతో ఎక్కువగా ఆలోచించకుండా ముందుకెళ్లాం. అదృష్టం కొద్దీ ముహూర్తానికల్లా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి’ అని పెళ్లి క్షణాలను గుర్తుచేసుకుందీ గ్లోబల్‌ బ్యూటీ.

ప్రత్యేక ఆకర్షణగా నిక్యాంక!

సంగీతానికి సంబంధించి అంతర్జాతీయంగా ఏటా నిర్వహించే బిల్‌బోర్డ్‌ మిర్చి మ్యూజిక్‌ అవార్డ్స్‌కు ఎంతో ప్రాధాన్యముంది. అలా ఈ ఏడాదికి సంబంధించి బహుమతుల ప్రదానోత్సవం ఇటీవల లాస్‌ ఏంజెల్స్‌ వేదికగా అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకల్లో ప్రియాంక-నిక్‌ దంపతులు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ సందర్భంగా గోల్డెన్‌ కలర్‌ స్లిట్‌ గౌనులో ప్రియాంక ఇట్టే చూపరులను ఆకట్టుకోగా, గ్రీన్‌ కలర్‌ సూట్‌లో సూపర్బ్‌ అనిపించాడు నిక్‌. అయితే ఈ వేడుకలకు కొద్ది రోజుల ముందే ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు నిక్‌. అయినా బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించాడు.

అందుకే నువ్వే నాకు స్ఫూర్తి!

ఇలా గాయాన్ని లెక్కచేయకుండా వేడుకలకు హాజరైన తన భర్తపై సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించింది ప్రియాంక. వేడుకల్లో భాగంగా తన భర్తను హత్తుకున్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ.. ‘ఇటీవల జరిగిన ఓ బైక్‌ ప్రమాదంలో నిక్‌ గాయపడ్డాడు. అతని పక్కటెముకల్లో ఫ్రాక్చర్‌ కూడా అయింది. అయినా సరే.. గాయాన్ని పట్టించుకోకుండా బిల్‌బోర్డ్‌ మిర్చి మ్యూజిక్‌ అవార్డ్స్‌ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించాడు. నిక్‌.. నిన్ను చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది. ప్రతి పనిలో నువ్వు చూపించే నిబద్ధత, కృషి రోజూ నాలో స్ఫూర్తి నింపుతుంటాయి. ఐ లవ్యూ సోమచ్‌!’ అంటూ తన భర్తపై ప్రేమ కురిపించిందీ అందాల తార.

నన్నెంతో జాగ్రత్తగా చూసుకున్నావ్‌ డియర్‌!

ఈ సందర్భంగా నిక్‌ కూడా ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టాడు. ‘గత వారం బైక్‌ ప్రమాదానికి గురయ్యాను. ఇప్పుడు నా ప్రియమైన సతీమణితో కలిసి బిల్‌బోర్డ్‌ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించి ఆ వారాన్ని ముగించా. ప్రియాంక.. నేను గాయపడినప్పటి నుంచి నువ్వు నా పక్కనే ఉన్నావ్‌.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నేను త్వరగా కోలుకునేలా చేశావ్‌. చిన్నతనం నుంచి ఈ అవార్డుల కార్యక్రమాన్ని చూస్తూ పెరిగిన నేను.. ఇప్పుడు ఈ వేడుకలకే హోస్ట్‌గా వ్యవహరించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. ఇలాంటి కార్యక్రమంలో నువ్వు నాకు తోడుగా, పక్కనే ఉన్నావ్‌.. ఐ లవ్యూ సోమచ్‌..!’ అని తన సతీమణిపై ఉన్న ప్రేమకు అక్షర రూపమిచ్చాడీ స్టార్‌ సింగర్‌. ఇలా వీరిద్దరూ ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను చాటుకుంటూ మరోసారి నేటి జంటల్లో స్ఫూర్తి నింపారు.

మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని