చదువుకుంటూనే పెట్రోల్‌ ట్యాంకర్‌ నడుపుతోంది! - 24 year old kerala girl drives petrol tanker truck in telugu
close
Updated : 26/06/2021 06:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చదువుకుంటూనే పెట్రోల్‌ ట్యాంకర్‌ నడుపుతోంది!

మహిళలు మానసికంగా బలవంతులే అయినా.. శారీరకంగా మాత్రం మగవారితో పోల్చితే బలహీనులే అన్నది చాలామంది భావన. అందుకే పురుషులు చేసే కొన్ని పనులు, ఉద్యోగాలు స్త్రీలు చేయలేరని అభిప్రాయపడుతుంటారు. ముఖ్యంగా ట్రాక్టర్లు, లారీలు, పెట్రోల్‌ ట్యాంకర్లు, బస్సులు.. వంటి భారీ వాహనాలను మహిళలు అసలు నడపలేరనుకుంటారు. కానీ ఇది పూర్తిగా అసత్యం, అవాస్తవం అని నిరూపిస్తోంది కేరళకు చెందిన 24 ఏళ్ల డెలిసియా డావిస్‌. కామర్స్‌లో పీజీ చేస్తోన్న ఈ యువతి ప్రమాదకరమైన పెట్రోల్‌ ట్యాంకర్‌ను అలవోకగా నడుపుతోంది. ఆమె డ్రైవింగ్‌ నైపుణ్యాల్ని చూసి రవాణాశాఖ అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ‘శెభాష్‌’ అంటూ ఆమెను అభినందిస్తున్నారు. మరి, ఓవైపు చదువుకుంటూనే మరోవైపు పెట్రోల్‌ ట్యాంకర్‌ ఎందుకు నడుపుతోందో తననే అడుగుదాం రండి..

స్టీరింగ్‌ పట్టిందంటే దూసుకుపోవాల్సిందే!

మొన్న హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన సీమాఠాకూర్‌ ఆర్టీసీ బస్సు నడిపితే.. నిన్న ఒడిశాకు చెందిన మోనాలిసా చీరకట్టులో లారీ నడిపి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈక్రమంలో మహిళలకు సాధ్యం కాని పనేదీ లేదంటూ ఏకంగా పెట్రోల్‌ ట్యాంకర్‌నే నడుపుతోంది కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన డెలిసియా. ఒక్కసారి ట్యాంకర్‌ స్టీరింగ్‌ పట్టిందంటే ఏకబిగిన 300 కిలోమీటర్ల ప్రయాణమైనా అలవోకగా చేస్తూ రవాణా శాఖ అధికారులను సైతం ఆశ్చర్యపరుస్తోందామె.

మూడేళ్ల నుంచి నడుపుతున్నా..!

మూడేళ్ల నుంచి పెట్రోల్‌ ట్యాంకర్‌ నడుపుతున్నప్పటికీ ఈ మధ్యనే వెలుగులోకి వచ్చింది డెలిసియా. లాక్‌డౌన్‌లో జాతీయ రహదారిపై పెట్రోల్‌ ట్యాంకర్‌ నడుపుతోన్న ఆమెను మోటార్‌ వెహికల్స్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు తనిఖీల కోసం ఆపారు. డ్రైవింగ్‌ సీట్లో కూర్చున్న ఆ యువతిని చూసి ఆశ్చర్యపోయారు. అయితే వెంటనే తన హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌తో పాటు హజార్డస్‌ గూడ్స్‌ (ప్రమాదకరమైన వస్తువులు) లైసెన్స్‌ను తీసి చూపించింది డెలిసియా. ‘తనిఖీల కోసం నన్ను ఆపిన అధికారులు మొదట ఆశ్చర్యపోయారు. వెంటనే నేను లైసెన్స్‌ పత్రాలు చూపించడంతో అభినందించడం మొదలుపెట్టారు. కేరళలో ఇలా పెట్రోల్‌ ట్యాంకర్‌ నడుపుతోన్న ఏకైక మహిళను నేనేనంటూ మీడియాకు కూడా సమాచారం అందించారు. మూడేళ్లుగా ఈ ట్యాంకర్ నడుపుతున్న నా గురించి ఎవరికీ తెలియకపోవడం నాక్కూడా ఆశ్చర్యంగానే అనిపిస్తోంది’ అంటోందీ డేరింగ్‌ లేడీ.

3 సార్లు.. 300 కిలోమీటర్లు!

డెలిసియా తండ్రి డావిస్‌ కూడా 42 ఏళ్ల పాటు ఇదే పెట్రోల్‌ ట్యాంకర్‌కు డ్రైవర్‌గా వ్యవహరిస్తున్నారు. దీంతో తన తండ్రిని చూస్తూ పెరిగిన ఆమె సహజంగానే చిన్నప్పటి నుంచి డ్రైవింగ్‌పై ఆసక్తి పెంచుకుంది. కూతురు అభిరుచిని గుర్తించిన డావిస్‌ కూడా ఆమెను అన్ని రకాలుగా ప్రోత్సహించారు. ఈ క్రమంలో మొదట టూ వీలర్‌ డ్రైవింగ్ నేర్చుకున్న డెలిసియా.. 16 ఏళ్లకు ఫోర్‌ వీలర్‌ డ్రైవింగ్‌ కూడా ఒంటబట్టించుకుంది. అయితే 20 ఏళ్లు వచ్చాక కానీ తనకు హెవీ వెహికల్‌ అండ్‌ హజార్డస్‌ గూడ్స్‌ లైసెన్స్‌ రాలేదు. ఈక్రమంలో మూడేళ్ల నుంచి కొచ్చి నుంచి మళప్పురానికి పెట్రోల్‌ ట్యాంకర్‌తో 300కిలోమీటర్లు ప్రయాణం చేస్తోందీ యంగ్‌ లేడీ. అది కూడా వారంలో 3సార్లు..!

అదే నా కల!

మరి, ఓవైపు పీజీ చదువుతున్నా మరోవైపు పెట్రోల్‌ ట్యాంకర్‌ ఎందుకు నడుపుతున్నావని డెలిసియాను అడిగితే.. డ్రైవింగ్‌పై తనకున్న ఆసక్తి, అభిరుచే అందుకు కారణమంటోంది. ‘నేను ఈ లారీకి క్లీనర్‌ని మాత్రమే. డ్రైవింగ్‌పై ఆసక్తి ఉండడంతో నాన్నకు చేదోడువాదోడుగా ఉండేందుకే ఇలా పెట్రోల్‌ ట్యాంకర్‌ నడుపుతున్నాను. నేను మూడేళ్ల నుంచి దీనిని నడుపుతున్నా. లాక్‌డౌన్‌ కావడంతో ప్రస్తుతం వారానికి కేవలం 3 ట్రిప్పులే వస్తున్నాయి. ఇంధనం నింపుకోవాల్సినప్పుడు తెల్లవారుజామున 2గంటలకే నిద్రలేస్తాను. ట్యాంకర్‌ను తీసుకుని 4గంటల కల్లా ఇరుంబనం చేరుకుంటాను. అక్కడ పెట్రోల్‌ నింపుకొని 9.30కల్లా తిరుచ్చి చేరుకుంటాను. ఆ తర్వాత ఇంధనాన్ని అన్‌లోడ్‌ చేసి తిరిగి ఇంటికి చేరుకునే సరికి మధ్యాహ్నం 3 అవుతుంది. సాయంత్రం నుంచి నా పీజీ ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరవుతాను. వోల్వో బస్సు నడపాలన్నదే నా కల. అందుకోసం లైసెన్స్‌ సాధించడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నా’ అని చిరునవ్వుతో చెబుతోందీ యంగ్‌ సెన్సేషన్‌.మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని