ఒలింపిక్స్‌ క్రీడల ఫొటోలు తీసింది! - a story of gitika talukdar the only female photojournalist from northeast india at the olympics
close
Updated : 11/08/2021 16:54 IST

ఒలింపిక్స్‌ క్రీడల ఫొటోలు తీసింది!

(Photos: Facebook.com/GitikaTalukder)

ఒలింపిక్‌ గ్రామంలో మన అథ్లెట్లు ప్రదర్శించిన ఆటతీరును ఆస్వాదించాం. వారు విజయ గర్వంతో పతకాలు అందుకుంటుండగా గెలుపు మనదే అని ఉప్పొంగిపోయాం.. వాళ్ల విజయ దరహాసానికి సంబంధించిన ఫొటోల్ని, వీడియోల్ని రిపీట్‌ చేసుకుంటూ మరీ తిలకించాం.. మరి, ఎంతసేపూ ఆటలు, క్రీడాకారులు అంటూ వాళ్ల పైనే దృష్టి పెట్టాం కానీ.. అసలు ఈ అద్భుత క్షణాలను ప్రత్యక్షంగా చూస్తూ.. క్లిక్‌మనిపించిన వ్యక్తుల గురించి బహుశా ఏ ఒక్కరూ ఆలోచించి ఉండరు. అలాంటి అరుదైన అవకాశమే దక్కించుకుంది అసోంకు చెందిన స్పోర్ట్స్‌ ఫొటో జర్నలిస్ట్ గీతికా తలుక్దార్‌. ఈ ప్రతిష్ఠాత్మక క్రీడల్ని కవర్‌ చేసే అద్భుత అవకాశాన్ని అందుకొని సక్సెసైన ఆమె.. సవాళ్లను సవాల్‌ చేయడమంటే తనకు ముందు నుంచే ఇష్టమంటోంది. గత 17 ఏళ్లుగా జాతీయంగా, అంతర్జాతీయంగా ఎన్నో క్రీడా పోటీల్ని తన కెమెరాలో బంధించిన గీతిక.. పురుషాధిక్యత ఉన్న ఇలాంటి రంగాల్లో రాణించినప్పుడే మన సత్తా ఏంటో ప్రపంచానికి తెలుస్తుందంటోంది.

రిస్క్‌తో కూడిన పనులు చేయడానికి, అరుదైన రంగాలను ఎంచుకోవడానికి చాలామంది మహిళలు ఇష్టపడరు. కంఫర్ట్‌ జోన్‌లో ఉంటూ ఎలాంటి సమస్యలూ లేకుండా పనులు పూర్తి చేసుకోవాలనుకుంటారు. కానీ చేసే పనిలో సవాళ్లుంటేనే అందులో మజా వస్తుందంటోంది గీతిక. పుట్టింది అరుణాచల్‌ ప్రదేశ్‌లోనే అయినా ఆమె స్వస్థలం అసోంలోని చమత అనే గ్రామం. తండ్రి ఉద్యోగం రీత్యా దేశంలోని వివిధ ప్రదేశాలకు వెళ్లిన ఆమె 2001 నుంచి తన కుటుంబంతో కలిసి అసోంలోనే స్థిరపడింది.

తాతగారి స్ఫూర్తితో..!

ఈ క్రమంలోనే దేశంలోని వివిధ కేంద్రీయ విద్యాలయాల్లో చదువుకుంది గీతిక. అసోంలోని దిబ్రూఘర్‌ యూనివర్సిటీలో పొలిటికల్‌ సైన్స్‌లో డిగ్రీ పూర్తిచేసిన ఆమె.. గువహటిలోని IMCM, Media Trust లో మాస్‌ కమ్యూనికేషన్‌-మీడియా టెక్నాలజీ విభాగంలో పీజీ డిప్లొమా చదివింది. BCIS Colombo నుంచి ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ విభాగంలో మరో పీజీ డిప్లొమా పట్టా అందుకుంది. చిన్నతనంలోనే తన తాతయ్య స్ఫూర్తితో ఫొటోగ్రఫీపై మక్కువ పెంచుకున్న గీతిక.. ఆ రంగంలోనే తన కెరీర్‌ని వెతుక్కుంది. చదువు పూర్తయ్యాక ఓ ఫొటో న్యూస్‌ ఏజెన్సీలో ఇంటర్న్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆమె.. పలు మీడియా సంస్థల్లో ఫొటో జర్నలిస్ట్‌గా, కంట్రిబ్యూటర్‌గా పనిచేసింది.

అందుకే స్పోర్ట్స్‌ని ఎంచుకున్నా!

ఫొటోగ్రఫీలోనూ చాలా విభాగాలున్నాయి.. అలాంటిది క్రీడల్నే ఎందుకు ఎంచుకున్నారని అడిగితే.. అందులో ఉన్న సవాళ్లే తనను ఇటువైపుగా లాగాయని చెబుతోంది గీతిక. ‘నాకు చిన్నప్పట్నుంచీ ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. మా తాతయ్య ఆ కాలంలో దర్శక నిర్మాతగా పనిచేశారు. ఆయన్ని చూశాక ఈ రంగంపై ఆసక్తి మరింతగా పెరిగింది. అయితే ఇందులోనూ క్రీడల్ని ఎంచుకోవడానికి ఓ కారణముంది. అదేంటంటే.. ఆటలంటేనే ఓ క్రమశిక్షణ. సరైన సమయానికి మొదలవడం, అనుకున్న సమయంలో పూర్తవడం.. ఇలా సమయపాలన విషయంలో ఇంత కచ్చితత్వం ఇక్కడ తప్ప మరెక్కడా చూడలేం. ముందు ఆ క్రమశిక్షణ నాకు నచ్చింది. ఇక స్పోర్ట్స్‌ ఫొటోగ్రఫీ అనేది పురుషాధిపత్యం ఉన్న రంగం. ఇక్కడ మహిళలకు అనునిత్యం సవాళ్లే ఎదురవుతుంటాయి. అలాంటి సవాళ్లను ఎదుర్కోవడమంటే నాకు మహా సరదా. అందుకే ఈ వృత్తిని ఎంచుకున్నా.. అందుకోసం మానసికంగా సన్నద్ధమయ్యా కూడా! గత 17 ఏళ్లుగా ఈ రంగంలో కొనసాగుతున్నా.. ఇలా నలుగురిలో ప్రత్యేకమైన వృత్తిని ఎంచుకున్నప్పుడే కదా మన సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసేది!’ అంటోంది గీతిక.

ఎన్నో టోర్నీల్ని కెమెరాలో బంధించి!

ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఏకైక ఫొటో జర్నలిస్ట్‌గా కీర్తి గడించిన గీతిక.. తన పదిహేడేళ్ల కెరీర్‌లో ఎన్నో జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లోని బెస్ట్ మొమెంట్స్‌ని తన కెమెరాలో బంధించింది. 2007లో ‘నేషనల్‌ గేమ్స్‌’; 2010 ‘కామన్వెల్త్‌ గేమ్స్‌’; 2013 నుంచి ఏటా జరిగే ‘ఐపీఎల్‌ టోర్నీ’; 2014 నుంచి ఏటా నిర్వహించే ‘ఐఎస్‌ఎల్‌ (ఇండియన్‌ సూపర్‌ లీగ్‌)’; 2016లో ‘సౌత్‌ ఏషియన్‌ గేమ్స్‌’; 2019లో జరిగిన ఫిఫా మహిళల ప్రపంచకప్‌, ఏఎఫ్‌పీ కప్‌.. వీటన్నింటితో పాటు ‘ఇండియా పాకిస్థాన్‌ లీగ్స్‌’, ‘ఐసీసీ మహిళల ప్రపంచకప్‌’.. వంటి టోర్నీలను సైతం తన కెమెరాలో బంధించిందామె. అయితే ఇవన్నీ ఒకెత్తయితే 2018లో FIFA ప్రపంచకప్‌ కవర్‌ చేయమని ఆ సంస్థ నుంచి ఆహ్వానం అందుకోవడం తన కెరీర్‌లోనే అత్యద్భుతమైన క్షణం అంటోంది గీతిక. ఇక ఇటీవలే ముగిసిన ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లోనూ పాల్గొని.. అక్కడ మన క్రీడాకారులు చేసిన అద్భుత క్రీడా ప్రదర్శనల్ని తన కెమెరాలో బంధించిందామె.

అయితే ఇలా మీడియా బాక్స్‌లో కూర్చొని మ్యాచ్‌ ఫొటోలు తీయడమే కాదు.. కపిల్‌ దేవ్‌, ధోనీ, మేరీకోమ్‌, శ్రీలంక క్రికెటర్‌ సంగక్కర, న్యూజిలాండ్‌ క్రికెటర్‌ సర్‌ రిచర్డ్‌ హాడ్లీ.. వంటి ప్రముఖుల ఇంటర్వ్యూలు కూడా నిర్వహించి.. తన కెరీర్‌లో మరెన్నో మధుర జ్ఞాపకాలను మూటగట్టుకున్నానంటోందీ సీనియర్‌ ఫొటోగ్రాఫర్.

ఆ సత్తా ఉంటే మనదే పైచేయి!

చాలామంది అమ్మాయిలు పురుషాధిపత్యం అన్న ఒక్క కారణంతో ఈ రంగాన్ని ఎంచుకోరు కానీ.. ఆసక్తి ఉండి కొన్ని సవాళ్లను ఎదుర్కోగలిగే సత్తా ఉంటే మాత్రం ఇందులో ఎంతో భవిష్యత్తు ఉందంటోంది గీతిక. 
‘ఒక ఫొటో జర్నలిస్టుగా ఎన్నో ప్రతిష్ఠాత్మక క్రీడలకు దేశం తరఫున ప్రాతినిథ్యం వహించచ్చు. ఇందులో ఉన్న పురుషాధిక్యత కారణంగా మొదట్లో పలు సవాళ్లు ఎదురవ్వచ్చు.. అయితే ఈ రంగంపై ప్రేమ ఉన్న వాళ్లు మొదట్లో పలు సవాళ్లను ఎదుర్కొని నిలదొక్కుకోగలిగితే అటు పేరుప్రఖ్యాతులతో పాటు ఇటు బోలెడంత డబ్బూ ఆర్జించచ్చు. అయితే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధపడడం ముఖ్యం.. ఇక శారీరక ఫిట్‌నెస్‌ కూడా ఇందులో ముఖ్యమే!’ అంటూ ఔత్సాహిక మహిళల్లో స్ఫూర్తి నింపుతోంది గీతిక.

నలుగురితో నారాయణ అనకుండా.. అందరిలో ఒక్కరిగా నిలిచి ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడమంటేనే తనకు ఇష్టమంటోన్న గీతిక.. ఈ రంగంలో ఆసక్తి ఉన్న అమ్మాయిందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పడంలో సందేహం లేదు.మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని