అతను మిమ్మల్ని నిజంగానే ప్రేమిస్తున్నాడా?? - a true boyfriend qualities in telugu
close
Published : 30/09/2021 17:39 IST

అతను మిమ్మల్ని నిజంగానే ప్రేమిస్తున్నాడా??

'ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే..' ఏంటీ మీ బాయ్‌ఫ్రెండ్ కూడా మిమ్మల్ని చూసి ఇలాగే పాడుతున్నాడా?? మరి అతను చూపించేది నిజమైన ప్రేమైతే సంతోషమే.. లేదంటే తర్వాత బాధపడాల్సింది మాత్రం మీరే. ప్రేమించడం, ప్రేమించబడడం ఎవరి జీవితంలోనైనా మర్చిపోలేని అనుభూతే. కానీ అవతలి వ్యక్తి మిమ్మల్ని నిజంగా, సిన్సియర్‌గా లవ్ చేస్తున్నారా? లేదా? అని తెలుసుకునే బాధ్యత మాత్రం మీదే. మరి అది తెలుసుకోవడమెలా? అంటారా?? అయితే ఇది చదవండి..

* ఒక వ్యక్తి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నట్లయితే మీకోసం ఎంత కష్టమైనా పడటానికి సిద్ధంగా ఉంటాడు. అలాగే మీ సుఖాల్ని తన సుఖాలుగా.. మీ కష్టాల్ని తన కష్టాలుగా భావిస్తాడు.

* మీ కుటుంబంతో, సన్నిహితులతో సత్సంబంధాలు కలిగి ఉంటాడు.

* తనకు వీలు దొరికినప్పుడల్లా మీతోనే గడపడానికి ఇష్టపడతాడు. అలాగే మిమ్మల్ని చూడకుండా ఎక్కువ రోజులు ఉండలేడు. ఎంత దూరంలో ఉన్నా వేళకు మీకు ఫోన్ చేయడం, మీ మంచిచెడ్డలు అడిగి తెలుసుకోవడం.. ఇలా తరచూ కాంటాక్ట్‌లో ఉంటాడు.

* ఏ విషయంలో అయినా సరే మీతో సంభాషించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటాడు.

* మీరు గెలిచినప్పుడు సంతోషిస్తాడు.. ఓడినప్పుడు ఎంకరేజ్ చేస్తాడు.

* మీరేదైనా మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని గౌరవిస్తాడు.

* ఏదీ దాచకుండా.. అతనికి సంబంధించిన ప్రతి విషయం మీతో షేర్ చేసుకుంటాడు.

* మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తే కనుక.. పదిమందిలో కూడా నిర్భయంగా ఆ విషయాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఎవరికో భయపడి మొహం చాటేయడు. మిమ్మల్ని ప్రేమించే విషయాన్ని రహస్యంగా ఉంచడు.

* వాళ్లింట్లో ఏవైనా పార్టీలైనా, ఫంక్షన్లు అయినా మిమ్మల్ని పిలవడం; స్నేహితులకు, కుటుంబ సభ్యులకు పరిచయం చేయడం.. లాంటివి చేస్తాడు.

* ఏ విషయంలోనూ మీతో తప్పుగా ప్రవర్తించడు. ఇతరుల వద్ద మీ గురించి కామెంట్స్ చేయడం, తప్పుగా మాట్లాడటం.. లాంటివి ఎంతమాత్రం చేయడు.

* మిమ్మల్ని ఏ చిన్న విషయంలోనూ బాధపెట్టడు. మీరెప్పుడూ నవ్వుతూ ఉండటాన్నే అతను ఇష్టపడతాడు.

* మీతో మాట్లాడేటప్పుడు చాలా సూటిగా, స్పష్టంగా మీ కళ్లలోకి చూస్తూ మాట్లాడతాడు.

చూశారుగా.. నిజమైన ప్రేమికుడిలో ఉండే కొన్ని లక్షణాల గురించి. అయితే ఇక్కడ ఒక చిన్న మాట. ఏ విషయంలో అయినా కొన్ని మినహాయింపులుంటాయి. ఫలానా విషయంలో 'ప్రతి ఒక్కరూ ఇలాగే ఆలోచిస్తారు, ప్రవర్తిస్తారు..' అని కచ్చితంగా చెప్పలేం. ప్రేమ విషయంలోనూ అంతే. కాబట్టి ఇక్కడ ఇచ్చిన లక్షణాలన్నీ నిజమైన ప్రేమకు కొన్ని సూచికలు మాత్రమే. ఇందుకు మినహాయింపులూ ఉండచ్చు.. ఈ లక్షణాలను మీ స్వీయ అనుభవాలకు, అనుభూతులకు అన్వయించుకుంటూ అవతలి వ్యక్తిది నిజమైన ప్రేమా? కాదా? అన్న విషయంలో ఎవరికి వారుగా ఒక నిర్ణయానికి రావడం అన్నివిధాలా శ్రేయస్కరం!మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని