ఇవి ఉంటే ఇక ఉప్పు పప్పు కోసం వెతకక్కర్లేదు! - adjustable kitchen racks which saves your cooking time
close
Updated : 19/07/2021 20:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇవి ఉంటే ఇక ఉప్పు పప్పు కోసం వెతకక్కర్లేదు!

అయ్యో.. ఉప్పెక్కడ పెట్టానో కనిపించడం లేదే.. కప్‌బోర్డ్‌లో ఎక్కడో ఒకచోట ఉప్పు డబ్బా పెట్టడం, ఇలా రోజూ దాని గురించి వెతకడం ప్రత్యూషకు అలవాటే.

నేహ తన కిచెన్‌లో పప్పులన్నీ ఒకే తరహా డబ్బాల్లో భద్రపరుస్తుంటుంది. అయితే అవి ట్రాన్స్‌పరెంట్‌గా లేకపోవడంతో ఏ పప్పు ఏ డబ్బాలో ఉందో పదే పదే మూత తీసి చూడాల్సిందే!

రాగిణి ఆఫీసుకెళ్లే హడావిడిలో గిన్నెలన్నీ తోమి ఆదరాబాదరాగా ఓ టబ్‌లో వేసేస్తుంది. ఇక సాయంత్రం ఇంటికొచ్చాక అందులో టీ గిన్నె ఎక్కడుందో వెతుక్కోవడానికి రోజూ కాస్త సమయం వృథా అవుతుందంటోంది.

ఇలా మనం కిచెన్‌ని ఎంత చక్కగా సర్దుకున్నా.. కొన్ని కొన్ని పదార్థాలు, వస్తువుల కోసం రోజూ వెతుక్కుంటూ ఉంటాం. మరి, ఇలాంటి కన్‌ఫ్యూజన్‌కి చెక్‌ పెట్టాలంటే ‘కిచెన్‌ ర్యాక్స్‌’ని మన వంటింట్లో భాగం చేసుకోవాల్సిందే! గరిటలు, గిన్నెల దగ్గర్నుంచి పప్పులు, స్పైసెస్‌.. వంటి పదార్థాల వరకు అన్నీ వేటికవే సెపరేట్‌గా అమర్చుకోవడానికి ప్రస్తుతం ఇలాంటి బోలెడన్ని మల్టీ పర్పస్‌ ర్యాక్స్‌ మార్కెట్లో అందుబాటులోకొచ్చేశాయి. ఏ ర్యాక్‌లో సర్దేవి ఆ ర్యాక్‌లో అరేంజ్‌ చేస్తే పని తగ్గడంతో పాటు సమయమూ ఆదా అవుతుంది.. అంతేనా.. కిచెన్‌ కూడా నీట్‌గా కనిపిస్తుంది.. పైగా వీటికంటూ ప్రత్యేకంగా కాస్త స్పేస్‌ కేటాయించాల్సిన అవసరం కూడా లేదు. గోడలు, చిన్న చిన్న ఖాళీ ప్రదేశాల్లో ఇట్టే ఇమిడిపోయే ఇలాంటి కొన్ని విభిన్న కిచెన్‌ ర్యాక్స్‌/మల్టీ పర్పస్‌ ర్యాక్స్‌ గురించి ఈ వారం ప్రత్యేకంగా మీకోసం..


అడ్జస్టబుల్‌ బాంబూ స్టోరేజ్‌ ర్యాక్‌

ఈ తరం వారిలో క్రమంగా ఆరోగ్య స్పృహ పెరుగుతుండడంతో రాన్రానూ ప్లాస్టిక్‌ వాడకం తగ్గిపోయి.. పర్యావరణహితమైన వస్తువుల వాడకం పెరిగిపోతోంది. ప్రస్తుతం మనం కిచెన్‌లో ఉపయోగిస్తోన్న మట్టి పాత్రలు, చెక్క వస్తువులు.. ఈ కోవలోకే వస్తాయి. ఇలా కేవలం వండుకోవడానికి ఉపయోగించే వస్తువులే కాదు.. కిచెన్‌ను నీట్‌గా సర్దుకోవడానికి వీలుగా ఉండే ర్యాక్స్‌ కూడా చెక్కతో చేసినవి ప్రస్తుతం మార్కెట్లో బోలెడన్ని డిజైన్లలో లభ్యమవుతున్నాయి. అలాంటిదే ఈ ‘అడ్జస్టబుల్‌ బాంబూ స్టోరేజ్‌ ర్యాక్‌’ కూడా!

చిత్రంలో చూపించిన విధంగా వంటింటి వస్తువులను పెట్టుకోవడానికి వీలుగా ర్యాక్స్‌ లేదా షెల్ఫుల మాదిరిగా ఉంటుందిది. దీన్ని కిచెన్‌లో ఖాళీ ప్రదేశంలో స్టాండ్‌లా నిలబెట్టుకోవచ్చు.. లేదంటే ఫొటోలో చూపించిన విధంగా రిఫ్రిజిరేటర్‌కి తగిలించుకునేందుకు వీలుగా ఉంటుందిది. ఈ బాంబూ ర్యాక్‌లోనూ మీకు నచ్చిన విధంగా 2, 3, 4 ర్యాక్స్‌ ఉన్న దాన్ని ఎంచుకోవచ్చు. ఇది వివిధ రకాల ఆకారాల్లో, సైజుల్లో కూడా లభిస్తుంది.


స్పైస్‌ టవర్‌ బాక్స్‌

మన వంటింట్లో పప్పులు, ఉప్పులు.. వంటివి భద్రపరచుకోవడానికి ఒకే రకమైన డబ్బాల్ని ఉపయోగించడం తెలిసిందే. అయితే ఇవి ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటే పర్లేదు.. కానీ డబ్బా మూత తీస్తే కానీ అందులో ఏముందో తెలియకపోతే మాత్రం అలాంటి డబ్బాలతో సమయం వృథానే అవుతుంది. పైగా ఒక్కో డబ్బా పక్కపక్కన అమర్చినా కాస్త స్పేస్‌ ఎక్కువే పడుతుంది. అలాకాకుండా మసాలాలన్నీ ఒకే డబ్బాలో, పప్పులన్నీ మరో డబ్బాలో.. ఇలా అమర్చుకుంటే వెతికే శ్రమా తగ్గుతుంది.. అలాగే కిచెన్‌లో స్పేస్‌ కూడా ఆదా అవుతుంది. అందుకోసమే ప్రస్తుతం మార్కెట్లో సందడి చేస్తున్నాయి ‘స్పైస్‌ టవర్‌ బాక్స్‌’లు. చిత్రంలో చూపించిన విధంగా క్యారియర్‌ మాదిరిగా ఉంటుందిది. పైగా దీన్ని గ్లాస్‌తో తయారుచేయడం వల్ల అందులో మీరు స్టోర్‌ చేసిన పదార్థాలు బయటికి కనిపిస్తాయి. సో.. ఎందులో ఏముందో టక్కున తీసుకొని ఉపయోగించుకోవచ్చు. తద్వారా వంటింట్లో పని ఈజీగా పూర్తవడంతో పాటు కిచెన్‌ కూడా నీట్‌గా కనిపిస్తుంది.


అడ్జస్టబుల్‌ ప్యాన్‌ పాట్‌ ర్యాక్‌

గిన్నెలను కడిగిన తర్వాత తడిగా ఉన్న వాటిని నేరుగా ర్యాక్స్‌లో పెడితే ఆ తడిదనం వల్ల వాటికి తుప్పు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసమే చాలామంది వాటిని ఆరబెట్టిన తర్వాత ర్యాక్స్‌లో సర్దుతుంటారు. మరి ఆరబెట్టడానికి ఓ ర్యాక్‌, సర్దుకోవడానికి ఓ ర్యాక్‌ అంటే ఇక మన పని పూర్తయినట్లే.. అనుకుంటున్నారా? ‘అడ్జస్టబుల్‌ ప్యాన్‌ పాట్‌ ర్యాక్‌’ ఉంటే ఇక ఆ శ్రమ కూడా అక్కర్లేదు. ఎందుకంటే ఈ ర్యాక్‌ సహాయంతోనే ఓవైపు గిన్నెలను ఆరబెట్టుకోవడం, మరోవైపు వాటిని అందులోనే అమర్చుకోవడం.. ఇలా రెండు పనులూ ఒకేసారి పూర్తవుతాయి. చిత్రంలో చూపించిన విధంగా ఒక ర్యాక్‌ మాదిరిగా ఉండే దీన్ని నేలపై లేదా కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌పై ఉంచి.. కడిగిన గిన్నెలను ఏటవాలుగా ఉంచి ఆరబెట్టుకోవచ్చు.. ఆపై ఆ ర్యాక్‌ని నిలబెడితే.. ఆ గిన్నెలన్నీ ఒకదానిపై మరొకటి అమర్చినట్లుగా ఉంటాయి. అయితే వీటిపై పెద్ద పెద్ద గిన్నెల్ని అమర్చుకుందామనుకుంటే మాత్రం.. ర్యాక్‌ గ్రిల్స్‌ని అడ్జస్ట్‌ చేస్తే సరిపోతుంది. ఇలా ప్యాన్స్‌, కడాయిలు.. వంటివన్నీ ఒకేచోట పెట్టుకునే వీలుండడం వల్ల ఒక్కోదాన్ని ఒక్కోచోట పెట్టి వెతుక్కోవాల్సిన పని ఉండదు.


అండర్‌ సింక్‌ ఆర్గనైజింగ్‌ ర్యాక్‌

ఏంటీ.. సింక్‌ కింద కూడా వస్తువులు పెట్టుకోవచ్చా అనుకోకండి! కిచెన్‌ శుభ్రం చేయడానికి మనం వాడే వస్తువులు, లిక్విడ్‌ సోప్, స్క్రబ్బర్స్‌.. వంటి వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఎంచక్కా సింక్‌ కింద నీట్‌గా అమర్చుకోవచ్చు. ఫలితంగా స్పేస్‌ కూడా ఆదా అవుతుంది. అందుకోసం డిజైన్‌ చేసిందే ఈ ‘అండర్‌ సింక్‌ ఆర్గనైజింగ్‌ ర్యాక్‌’. చిత్రంలో చూపిన విధంగా అరలు అరలుగా ఉంటుందీ స్టాండ్‌. వీటి ర్యాక్స్‌ మధ్యలోని భాగాల్ని విడిగా తొలగించి మధ్యలో సింక్‌ పైప్‌ని సెట్‌ చేసుకోవచ్చు. ఇదే కాకుండా.. మనం పెట్టే బాటిల్స్‌ పెద్దవైతే ఇందులోని అరల్ని తొలగించే సౌలభ్యం కూడా ఉంది కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.


హ్యాంగింగ్‌ పాట్‌ ప్యాన్‌ ఆర్గనైజింగ్‌ ర్యాక్‌

గరిటలు, ప్లేట్స్‌.. ఇలా అన్నింటినీ ఒకచోట పెట్టుకునే ర్యాక్‌ దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. దీని నుండి మనకు కావాల్సిన వస్తువును మనం ఈజీగా తీసుకొని వాడుకోవచ్చు. వీటితో పాటు ప్యాన్‌, కడాయిలను కూడా అమర్చుకునే ర్యాక్‌ ఉంటే బాగుంటుంది కదూ! ఆ ఆలోచనతోనే ఈ ‘హ్యాంగింగ్‌ పాట్‌ ప్యాన్‌ ఆర్గనైజింగ్‌ ర్యాక్‌’ను తయారుచేశారు డిజైనర్లు. మనం వాడే రెగ్యులర్‌ ర్యాక్‌కి కాస్త ఆధునికత జోడించి రూపొందించిన ఈ ర్యాక్‌ ఫొటోలో చూపించినట్లుగా పైన అరలు, కింద హుక్స్‌ మాదిరిగా ఉంటుంది. పైన అరల్లో పెద్ద పెద్ద పాత్రల్ని పెట్టుకోవచ్చు.. కింద ఉండే హుక్స్‌కి గరిటలు, ప్యాన్స్‌ వేలాడదీయచ్చు. ఇలాంటి ర్యాక్‌ను చేతికి అందుబాటులో ఉండేలా ఎక్కడైనా గోడలకు తగిలించుకోవచ్చు.


మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని