తాలిబన్ల రాకతో వారు మళ్లీ ఇళ్లలోనే మగ్గిపోవాలేమో! - afghan karate champion meena asadi voicing her fear for athletes
close
Updated : 22/08/2021 09:12 IST

తాలిబన్ల రాకతో వారు మళ్లీ ఇళ్లలోనే మగ్గిపోవాలేమో!

(Photo: Instagram)

తాలిబన్ల ఆగడాలతో అఫ్గాన్‌ పౌరుల్లో భయాందోళనలు పెరిగిపోతున్నాయి. వాళ్లను తప్పించుకుని దేశం దాటేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇక ఇన్ని రోజులు అభివృద్ధి వైపు అడుగులేసిన అఫ్గాన్‌ అమ్మాయిలు షరియా చట్టాలతో మళ్లీ అంధకారంలోకి వెళ్లిపోతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని కార్యాలయాల్లోని మహిళలు, అమ్మాయిలను తాలిబన్లు ఇంటికి పంపించేస్తోన్న సంఘటనలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

అఫ్గాన్‌కు చెందిన కరాటే ఛాంపియన్‌ 28 ఏళ్ల మీనా అసది కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ఇండోనేషియా రాజధాని జకార్తాలో శరణార్థిగా తలదాచుకున్న ఆమె... తాలిబన్ల రాకతో తమ దేశ మహిళా క్రీడాకారుల ఆశలు, ఆశయాలకు గండి పడతాయంటోంది. వారు మళ్లీ ఇళ్లల్లో మగ్గిపోవాల్సిన దారుణ పరిస్థితులు వస్తాయంటోంది.

కట్టుబాట్లను కాదని కరాటే!

చాలామంది అఫ్గాన్‌ అమ్మాయిల్లాగే తన కల కోసం కట్టుబాట్లను కాదనుకుంది మీనా. చిన్నతనంలోనే కరాటేపై ఆసక్తి పెంచుకొన్న ఆమె ఇప్పటికీ ఆటే జీవితంగా బతుకుతోంది. అఫ్గానిస్థాన్‌ నేషనల్‌ కరాటే ఫెడరేషన్‌లో చేరి కరాటేలో ఓనమాలు నేర్చుకుంది మీనా. అయితే అక్కడి అల్లకల్లోల పరిస్థితులు ఆమెను దేశం వదిలివెళ్లేలా చేశాయి. 12 ఏళ్ల వయసులో పాకిస్థాన్‌కు వెళ్లిపోయిన మీనా అక్కడే కరాటేలో శిక్షణ తీసుకుంది. శరణార్థిగా ఎన్నో సమస్యలెదుర్కొన్నప్పటికీ ధైర్యంగా ముందుకు సాగింది. వివిధ కరాటే పోటీల్లో పాల్గొని పతకాలు గెల్చుకుంది. 2010లో మళ్లీ అఫ్గాన్‌కు తిరిగొచ్చింది. అదే ఏడాది బంగ్లాదేశ్‌ వేదికగా జరిగిన దక్షిణాసియా క్రీడల్లో అఫ్గాన్‌ తరఫున మూడు వెండి పతకాలు గెల్చుకుంది. ఆ తర్వాత 2012లో ఇండియాలో జరిగిన ఆసియా కరాటే ఛాంపియన్‌షిప్‌లోనూ రెండు రజత పతకాలు సాధించింది. ఈ క్రీడల్లో అఫ్గానిస్థాన్‌కు ప్రాతినిథ్యం వహించిన ఏకైక మహిళా క్రీడాకారిణి మీనానే.

దేశం విడిచిపెట్టి!

క్రీడాకారిణిగా పోటీల్లో పాల్గొంటూనే తన లాంటి అమ్మాయిలకు కరాటేలో శిక్షణ ఇవ్వాలనుకుందీ కరాటే ఫైటర్‌. ఇందుకోసం కాబూల్‌లో ఓ ఫైట్‌క్లబ్‌ను కూడా ఏర్పాటు చేయాలనుకుంది. కానీ దేశంలోని అల్లకల్లోల పరిస్థితులు ఆమె ఆశయానికి అడ్డుపడ్డాయి. దీంతో తన భర్త, ఏడాది వయసున్న కూతురును తీసుకుని రెండోసారి దేశం విడిచిపెట్టి వెళ్లిపోయింది.

అందుకే కరాటేకు ప్రత్యేక స్థానం!

2015 నుంచి ఇండోనేషియాలోని సిసారువా పట్టణంలో ఉంటోంది మీనా. అక్కడే ఓ కరాటే క్లబ్‌ను ఏర్పాటు చేసి తనలాంటి శరణార్థి అమ్మాయిలకు శిక్షణనిస్తోంది. ఇరాన్‌, అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌...తదితర దేశాలకు చెందిన మొత్తం 30 మంది అమ్మాయిలు ఆమె దగ్గర శిక్షణ పొందుతున్నారు. ఇందులో కొందరు బెల్ట్‌ ర్యాంక్‌ సర్టిఫికెట్లు కూడా అందుకున్నారు.

‘నా జీవితంలో కరాటేకు ప్రత్యేక స్థానముంది. ఇది నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. సమస్యలు, సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో నాకు నేర్పింది. నా నైపుణ్యాన్ని మరికొంతమంది అమ్మాయిలకు అందిస్తున్నాను. ఎందుకంటే ఇది వారి హక్కులు కాపాడుకోవడానికి సహకరిస్తుంది’ అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది మీనా.

వారి ఆశలకు గండి పడుతుందేమో!

పారాలింపిక్స్‌లో పాల్గొన్న తొలి అఫ్గాన్‌ మహిళగా చరిత్ర సృష్టించాలనుకున్న పారా తైక్వాండో అథ్లెట్‌ జకియా ఆశలు తాలిబన్ల రాకతో అడుగంటిపోయాయి. ప్రస్తుతం ఆమె ఇంట్లోనే చిక్కుకుపోయింది. ఈ నేపథ్యంలో జకియా ఒక్కటే కాదు...మున్ముందు అఫ్గాన్‌లోని మరికొంతమంది క్రీడాకారిణుల పరిస్థితి కూడా ఇదేనంటోంది మీనా.

‘చాలా బాధగా ఉంటోంది. తాలిబన్ల దురాక్రమణతో నాతో పాటు నాదేశ ప్రజలు కూడా ఆశలు కోల్పోయారు. ముఖ్యంగా మహిళా అథ్లెట్ల ఆశలు, ఆశయాలకు అడ్డుకట్ట పడుతుందేమోననిపిస్తోంది. ఇప్పటివరకు వారు సాధించిన అభివృద్ధి, ప్రగతికి అర్థం లేకుండా పోయాయి. అమ్మాయిలు ఇక ఇంటికి పరిమితం అవ్వాల్సి వస్తుందేమో..’ అని ఆవేదన చెందుతోందీ కరాటే ఫైటర్.మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని