మైనింగ్ మిస్టరీ తెలుసుకోవాలని..! - akanksha becomes coal india first woman engineer to work in underground mine
close
Published : 01/09/2021 20:11 IST

మైనింగ్ మిస్టరీ తెలుసుకోవాలని..!

(Photo: Twitter)

బొగ్గు గనులు, మైనింగ్‌ తవ్వకాల్లో ఎక్కువగా పాలుపంచుకునేది పురుషులే. శారీరక శ్రమతో కూడిన ఈ పనుల్లో మహిళలు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. జార్ఖండ్‌కు చెందిన ఆకాంక్ష కుమారి కూడా ఈ అరుదైన కోవకే చెందుతుంది. చిన్నప్పటి నుంచి బొగ్గు గనుల తవ్వకాలను చూస్తూ పెరిగిన ఈ 25 ఏళ్ల యువతి తాజాగా సెంట్రల్‌ కోల్‌ ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ (CCL)లో అండర్‌ మైనింగ్‌ ఇంజినీర్‌గా ఎంపికైంది. తద్వారా ఈ ఘనత సాధించిన మొదటి మహిళగా రికార్డు సాధించింది.

మొదటి మహిళగా!

ప్రపంచంలోని అతి పెద్ద బొగ్గు కంపెనీల్లో కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (CIL) కూడా ఒకటి. దీనికి అనుబంధంగా ఉన్న సంస్థే సీసీఎల్‌. ఇందులో ఆఫీసర్లు, డాక్టర్లు, సెక్యూరిటీ గార్డులు, మెషిన్‌ హ్యాండ్లర్లు, డంపర్లు తదితర బాధ్యతలను పురుషులతో సమానంగా, సమర్థంగా నిర్వర్తిస్తున్నారు ఎంతోమంది మహిళలు. అయితే అండర్‌ గ్రౌండ్‌ మైనింగ్‌లో ఇప్పటివరకు మహిళలు పనిచేసిన దాఖలాలు లేవు. తాజాగా ఆ లోటును కూడా తీర్చేసింది ఆకాంక్ష.

ఆ ఆసక్తే ఇంజినీర్‌ను చేసింది!

జార్ఖండ్‌లోని ఛురి భూగర్భ గనుల్లో మైనింగ్‌ ఇంజినీర్‌గా బాధ్యతలు స్వీకరించిందీ టీనేజర్‌. సీఐఎల్‌లో మైనింగ్‌ ఇంజినీర్‌గా ఎంపికైన రెండో మహిళ ఆకాంక్ష. కానీ భూగర్భ గనుల్లో ఒక మహిళ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తించడం ఇదే మొదటిసారి. జార్ఖండ్‌లోని హజారీబాగ్‌ జిల్లా బడ్కాగావ్‌ బొగ్గు గనులకు బాగా ప్రసిద్ధి. ఈ ప్రాంతంలోనే పుట్టి పెరిగింది ఆకాంక్ష. అందుకే చిన్నప్పటి నుంచి తన ఇంటి చుట్టపక్కల ఉండే బొగ్గు గనులు, మైనింగ్‌ తవ్వకాల గురించి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది.

మైనింగ్ మిస్టరీ తెలుసుకోవాలని!

నవోదయ విద్యాలయలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసింది ఆకాంక్ష. ఆ తర్వాత తన ఆసక్తికి తగ్గట్లుగా ధన్‌బాద్‌లోని బిర్సా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (BIT) నుంచి మైనింగ్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పట్టా అందుకుంది. ఆ వెంటనే హిందూస్థాన్‌ జింక్‌ లిమిటెడ్‌ కంపెనీకి చెందిన బలేరియా మైన్స్‌లో మూడేళ్ల పాటు పనిచేసింది.

 ‘మైనింగ్ రహస్యాలు తెలుసుకోవాలనే కోరిక నాకు చిన్నప్పటి నుంచి ఉంది. అదే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. కోల్‌ ఇండియా లిమిటెడ్‌లో ఇంజినీర్‌గా చేరడంతో నా కల నెరవేరినట్లైంది. ఈ క్రెడిట్‌ అంతా మా అమ్మానాన్నలకే చెందుతుంది. వారి ప్రోత్సాహమే నన్ను ముందుకు నడిపించింది. నా శక్తి సామర్థ్యాలపై నమ్మకముంచి నాకు ఈ బాధ్యతలు అప్పగించిన సీసీఎల్‌కు కృతజ్ఞతలు’ అని చెప్పుకొచ్చిందీ మైనింగ్‌ ఇంజినీర్.

ఆమె ధైర్యమే ఇక్కడకు రప్పించింది!

గనుల్లో పని చేయడమంటే ఎంతో సవాలుతో కూడుకున్నది. దీనికి తోడు కొన్ని చట్టాలు, నియమాలు మహిళలను భూగర్భ గనుల్లోకి ప్రవేశించకుండా అడ్డుకున్నాయి. అయితే 2019 నుంచి ఈ చట్టాల్లో కొన్ని సడలింపులు మొదలయ్యాయి. అందులో భాగంగానే ఆకాంక్ష మైనింగ్‌ ఇంజినీర్‌గా ఎంపికైంది. ఆమెకు ధైర్యంతో పాటు ఓ లక్ష్యం కూడా ఉంది. అదే ఆమెను ఇక్కడకు తీసుకొచ్చింది’ అని సీసీఎల్‌ జనరల్‌ మేనేజర్‌ చెప్పుకొచ్చారు.

మహిళలకు మరిన్ని అవకాశాలు!

ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు గనుల శాఖా మంత్రి ప్రహ్లాద్‌ జోషి ట్విట్టర్‌ వేదికగా ఆకాంక్షకు అభినందనలు తెలిపారు. ‘ఇదొక అద్భుతమైన రోజు. ఆకాంక్ష నియామకం లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడంతో పాటు మహిళలకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుంది’ అని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు కేంద్రమంత్రి.



మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని